Bengaluru : మొదటిసారి ఫ్లైట్ ఎక్కాడట.. తెలియక తప్పు చేశాడట.. విమానంలో షాకింగ్ ఘటన

రైళ్లలో, బస్సుల్లో బీడీలు కాల్చేవాడట. ఆ అలవాటునే విమానంలోనూ కంటిన్యూ చేశాడు. ఇంకేముంది విమాన సిబ్బంది పోలీసులకు అప్పగించారు. మొదటిసారి ఫ్లైట్ ఎక్కానని మొర పెట్టుకున్నా కుదరలేదు. పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు.

Bengaluru : మొదటిసారి ఫ్లైట్ ఎక్కాడట.. తెలియక తప్పు చేశాడట.. విమానంలో షాకింగ్ ఘటన

Bengaluru

person smoked in the plane was arrested : విమానంలో ప్రయాణించేటపుడు అధికారులు ప్రయాణికులను నిశితంగా తనిఖీ చేస్తారు. వారి వెంట తెచ్చే వస్తువుల్ని కూడా ఓ కంట కనిపెడతారు. తెలియక చేసే కొన్ని పనుల వల్ల అతి పెద్ద ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అగ్నికి సంబంధించిన వస్తువుల్ని అస్సలు అనుమతించరు. రీసెంట్‌గా బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు విమానం బాత్రూంలో బీడీ కాల్చడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.

Bengaluru : బెంగళూరులో ఉబెర్ ఆటో బుక్ చేసుకున్నారా? ఇక గమ్యస్ధానానికి చేరినట్లే..

రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి విమానం ఎక్కాడు. అహ్మదాబాద్ నుంచి బెంగళూరుకి ప్రయాణిస్తూ టాయిలెట్‌లోకి వెళ్లిన అతను బీడీ కాల్చడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా స్మోక్ అలర్ట్ రావడంతో విమాన సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఆ పొగ బాత్రూం వైపు నుంచి రావడం గమనించి బయటకు వచ్చిన ఆ వ్యక్తిని ప్రశ్నించారు. బెదిరిపోయిన ఆ ప్రయాణికుడు నిబంధనల గురించి తనకు తెలియదని.. విమానం ఎక్కడం ఇదే మొదటిసారి అని చెప్పుకొచ్చాడు.

Air India Urination Case: విమానంలో మూత్ర విసర్జన కేసు.. ఎయిర్ ఇండియాకు డీజీసీఏ భారీ జరిమానా ..

అయినా సరే విమాన సిబ్బంది అతడిని పోలీసులకు అప్పగించారు. పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.