Air India Urination Case: విమానంలో మూత్ర విసర్జన కేసు.. ఎయిర్ ఇండియాకు డీజీసీఏ భారీ జరిమానా ..

గత ఏడాది నవంబర్ 26న ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై ఓ వ్యక్తి మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన కేసు విషయంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. పౌర విమానయాన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియా యాజమాన్యంకు రూ.30లక్షల జరిమానా విధించడంతో పాటు ...

Air India Urination Case: విమానంలో మూత్ర విసర్జన కేసు.. ఎయిర్ ఇండియాకు డీజీసీఏ భారీ జరిమానా ..

AIR INDIA

Air India Urination Case: గత ఏడాది నవంబర్ 26న ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై ఓ వ్యక్తి మద్యం మత్తులో మూత్రవిసర్జన చేసిన కేసు విషయంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. పౌర విమానయాన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియా యాజమాన్యంకు రూ.30లక్షల జరిమానా విధించడంతో పాటు, తన విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైన పైలట్ ఇన్ కమాండ్ లైసెన్స్‌ను మూడు నెలలు సస్పెండ్ చేసింది. అంతేకాక, ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఇన్ ప్లైట్ సర్వీసెస్ కు రూ.3 లక్షల జరిమానా విధించింది.

Air India : ఎయిరిండియా విమానంలో మహిళపై మూత్రవిసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్..

గతేడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి మద్యం మత్తులో తనపై మూత్ర విసర్జన చేశాడని పేర్కొంటూ పోలీసులకు 70ఏళ్ల వృద్ధ మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేసిన విషయం విధితమే. జనవరి 7న పోలీసులు మిశ్రా ఆచూకి గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఆయన్ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Air India flight : విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన మందుబాబు, ఏం పర్లేదు డ్రెస్ మార్చుకోమన్న సిబ్బంది

ఈ కేసు విషయంలో ఎయిర్ ఇండియా సకాలంలో చర్యలు తీసుకోలేదని, నేను రాజీ పడలేదని బాధిత మహిళ ఆరోపించింది. ఆ తర్వాత డీజీసీఏ ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో డీజీసీఏ ఎయిర్ ఇండియాను ప్రశ్నించింది. అయితే, తాజాగా పౌర విమానయాన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియా యాజమాన్యంకు రూ.30లక్షల జరిమానా విధించింది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఎయిరిండియా నిందితుడు శంకర్ మిశ్రాను నాలుగు నెలలపాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించిన విషయం విధితమే.