Vistara flight : ‘ నా కూతుర్ని బెదిరిస్తావా? నీకెంత ధైర్యం?’ విస్తారా ఫ్లైట్‌లో ఓ తండ్రి ఫైట్

కూతురితో ప్రయాణికుడి ప్రవర్తన సరిగా లేదని ఆమె తండ్రి అతనిపై విరుచుకుపడ్డాడు. ఫ్లైట్ సిబ్బంది గొడవని సర్దుబాటు చేయడానికి తిప్పలు పడ్డారు. విస్తారా ఫ్లైట్ లో జరిగిన ఈ ఘటన వైరల్ అవుతోంది.

Vistara flight : ‘ నా కూతుర్ని బెదిరిస్తావా? నీకెంత ధైర్యం?’ విస్తారా ఫ్లైట్‌లో ఓ తండ్రి ఫైట్

Vistara flight

Updated On : July 3, 2023 / 7:00 PM IST

Vistara flight : ఇటీవల కాలంలో రైళ్లలో, విమానాల్లో యుద్ధాలు కామన్ అయిపోయాయి. కూతురి పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన యువకుడిపై ఆమె తండ్రి విరుచుకుపడ్డాడు. దాంతో ఇద్దరు ప్రయాణికుల మధ్య తీవ్రస్ధాయిలో గొడవ జరిగింది. విస్తారా విమానంలో జరిగిన ఈ ఘటనలో క్యాబిన్ సిబ్బంది కలగజేసుకుంటే కానీ గొడవ సర్దుమణగలేదు.

Bengaluru : మొదటిసారి ఫ్లైట్ ఎక్కాడట.. తెలియక తప్పు చేశాడట.. విమానంలో షాకింగ్ ఘటన

ముంబయి నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న విస్తారా విమానంలో ఇద్దరు ప్రయాణికులు గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకున్నారు. ఓ ప్రయాణికుడి కూతురితో ఓ యువకుడు అభ్యంతరకరంగా ప్రవర్తించాడని అతను గొడవకు దిగాడు. Ghar Ke Kalesh అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ‘నా కూతురిని బెదిరించడానికి నీకు ఎంత ధైర్యం?’ అంటూ యువతి తండ్రి అరవడం మొదలుపెట్టాడు.  క్యాబిన్ సిబ్బంది వారికి సర్ది చెప్పడంతో సమస్య పరిష్కరించబడిందట. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.  గతంలో కూడా విమానాల్లో జరిగిన గొడవలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇస్తాంబుల్-ఢిల్లీ విమానంలో ప్రయాణికుడితో ఇండిగో ఎయిర్ హోస్టెస్ తీవ్ర వాగ్వాదానికి దిగారు. తోటి ప్రయాణికుల మధ్య గొడవలు కూడా జరిగాయి.

United Airlines : పిచ్చి కోపంతో ఫ్లైట్ అటెండెంట్‌ను కొట్టాడు.. అత్యవసర ద్వారం నుంచి దూకబోయాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే…

అయితే ఈ ఘటనపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎక్కువ శాతం మంది యువకుడి పక్షాన మాట్లాడారు.