United Airlines : పిచ్చి కోపంతో ఫ్లైట్ అటెండెంట్‌ను కొట్టాడు.. అత్యవసర ద్వారం నుంచి దూకబోయాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే…

తన కోపమే తన శత్రువు అంటారు. కోపం వల్ల వారికి వారే నష్టపోతారు. ప్రయాణాల్లో చాలామందికి సహనం తక్కువగా ఉంటుంది. సీటు కోసం, ఇతర చిన్న చిన్న కారణాలతో తోటి ప్రయాణికులతో గొడవ పడతారు. ఫలితంగా ఏమవుతుంది? అంటే బెంజమిన్ లోవిన్స్‌ అనే ప్రయాణికుడికి ఏం జరిగిందో చదవండి.

United Airlines : పిచ్చి కోపంతో ఫ్లైట్ అటెండెంట్‌ను కొట్టాడు.. అత్యవసర ద్వారం నుంచి దూకబోయాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే…

 United Airlines

Updated On : May 4, 2023 / 12:56 PM IST

United Airlines :  తోటి ప్రయాణికుడితో జరిగిన చిన్న గొడవ కారణంగా ఓ ప్రయాణికుడు పిచ్చి కోపంతో ఫ్లైట్ అటెండెంట్‌ను కొట్టాడు. విమానం నుంచి దూకడానికి ప్రయత్నించాడు. ఫలితంగా భవిష్యత్తులో విమాన ప్రయాణాలు చేయకుండా నిషేధానికి గురయ్యాడు.

Air Vistara : విమానంలో మామిడిపండ్లు పోగొట్టుకున్నాడు.. ఎయిర్లైన్ సిబ్బంది ఏం చేశారంటే?

యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం టెక్సాక్‌కు బయలు దేరింది. బెంజమిన్ లోవిన్స్‌ అనే ప్రయాణీకుడు విమానం టేకాఫ్ అయ్యే సమయంలో కోపంతో ఊగిపోతూ అత్యవసర ద్వారం నుంచి దూకడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అడ్డుకున్న ఫ్లైట్ అటెండెంట్‌ను కొట్టాడు. ఈ తతంగమంతా జిమెనెజ్ అనే ప్రయాణికుడు వీడియో తీశాడు. గొడవకు అసలు కారణం ఏంటంటే?

 

జిమెనెజ్‌కు కేటాయించిన సీటులో లోవిన్స్ భార్య కూర్చుందట. ఆమెను లేవాల్సిందిగా జిమెనెజ్ కోరగానే‌ లోవిన్స్‌కి విపరీతంగా కోపం వచ్చేసింది. వెంటనే గొడవకు దిగాడు. అతనికి సర్ది చెబుదామని వచ్చిన ఫ్లైట్ అటెండెంట్‌ను కూడా లోవిన్స్ చితక బాదాడు. ఆ తరువాత తన భార్యను కూడా కొట్టడం ప్రారంభించాడు. వెంటనే విమాన అత్యవసర ద్వారం నుంచి దూకడానికి ప్రయత్నం చేశాడు. ఈ తతంగమంతా మిగతా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిని కలిగించింది.

Cat Viral Pic: “ఈ పిల్లి ఎవరిది? నాకు దొరికింది”.. విమానంలో ఆసక్తికర ఘటన

ఈ వీడియో చూసిన వారు రకరకాలుగా స్పందించారు. విమానాల్లో ఇలాంటి సంఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యునైటెడ్ ఎయిర్ లైన్స్ కూడా ఈ ఘటనపై స్పందించింది. లోవిన్స్ చర్య ఆమోదించదగినది కాదని భావిస్తున్నామని చెబుతూ అతను భవిష్యత్‌లో విమాన ప్రయాణాలు చేయకుండా నిషేధం ప్రకటించింది.

 

బస్సుల్లో, ట్రైన్లలో కూడా చాలామంది అకారణంగా గొడవలకు దిగుతుంటారు. ఒక్కోసారి తోటివారిపై దాడికి దిగుతుంటారు. ఇలాంటి చర్యలను ఎవరూ సమర్ధించరన్న విషయం లోవిన్స్‌ను చూసైనా అలాంటి వారు తెలుసుకోవాల్సిన విషయం.