దీనంగా చేతులు చాచి, ప్రాథేయపడి, అడిగి మరీ నీళ్లు తాగిన ఉడత.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

  • Published By: naveen ,Published On : July 18, 2020 / 02:07 PM IST
దీనంగా చేతులు చాచి, ప్రాథేయపడి, అడిగి మరీ నీళ్లు తాగిన ఉడత.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

Updated On : July 20, 2020 / 4:37 PM IST

అదో ఉడత. పాపం దానికి బాగా దాహమైంది. దాహాన్ని తట్టుకోలేకపోయిన ఆ ఉడత నీరు కావాలని ఓ అబ్బాయిని అడిగింది. దీనంగా చేతులు చాచి, అతడి చుట్టూ తిరుగుతూ, అతడి వెంట పడుతూ మరీ నీరు కావాలని ప్రాథేయపడింది. చివరకు ఉడత బాధను అర్థం చేసుకున్న ఆ అబ్బాయి తన చేతిలో ఉన్న బాటిల్ మూత తీసి దానికి నీరు తాగించాడు.

అయ్యో పాపం, మూగజీవికి ఎంత కష్టమొచ్చింది:
కడుపు నిండా నీరు తాగిన ఉడత, దాహం తీరాక అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ, ఇప్పుడీ వీడియో అందరి గుండెలను కదిలిస్తోంది. అయ్యో పాపం అని జాలి పడేలా చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు పెద్ద సంఖ్యలో రిప్లయ్ ఇస్తున్నారు. ఉడత లాగే ఎంతమంది మనుషులు నీరు, ఆహారం లేక అలమటిస్తున్నారో అని ఆవేదన వ్యక్తం చేశారు. మూగ జీవాల బాధను అర్థం చేసుకుని తాగు నీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందంటున్నారు. అడవులు అంతరించిపోతుండటం, చెరువులు, నదులు ఇంకిపోతుండటం వల్ల మూగజీవాలు నరకయాతన అనుభవిస్తున్నాయని వాపోయారు.