Plane Crash : కెనడాలో నేలకూలిన శిక్షణ విమానం.. ఇద్దరు భారత ట్రైనీ పైలట్లు సహా ముగ్గురు మృతి
రెండు ఇంజన్ల తేలికపాటి విమానం పైపర్ పీఏ-34 సెనెకా హఠాత్తుగా చిల్లీవాక్ సిటీకి దగ్గరలో ఉన్న మోటెల్ వెనుక చెట్లు, పొదల మధ్య కుప్పకూలింది.

Canada Training Plane Crash
Canada Plane Crash : కెనడాలో విమాన ప్రమాదం జరిగింది. శిక్షణ విమానం నేలకూలి భారత్ కు చెందిన ఇద్దరు ట్రైనీ పైలట్లు సహా ముగ్గురు దర్మరణం చెందారు. బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ లో శనివారం విమానం కూలిన ప్రమాదంలో ముంబైకి చెందిన శిక్షణ పైలట్లు అభయ్ గద్రూ, యాష్ రాముగడే మృతి చెందారు.
వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. రెండు ఇంజన్ల తేలికపాటి విమానం పైపర్ పీఏ-34 సెనెకా హఠాత్తుగా చిల్లీవాక్ సిటీకి దగ్గరలో ఉన్న మోటెల్ వెనుక చెట్లు, పొదల మధ్య కుప్పకూలింది.
Actor Nushrratt Bharuccha : ఇజ్రాయెల్ నుంచి ఇండియాకు వచ్చే విమానం ఎక్కిన సినీనటి నుష్రత్
ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో మరో పైలట్ కూడా మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కెనడాకు చెందిన ట్రాన్స్ పోర్యేషన్ సేఫ్టీ బోర్డు విచారణ చేస్తోంది.