Tipu Sultan Sword : రూ.144 కోట్లకు అమ్ముడు పోయిన టిప్పు సుల్తాన్ ఖడ్గం

మైసూర్ టైగర్ టిప్పు సుల్తాన్ పరిపాలన..ఆయన వాడిన ఆయుధాలు అన్నీ అసాధారణ చరిత్రే. రీసెంట్‌గా ఆయన వాడిన కత్తి లండన్‌లో జరిగిన వేలంలో £14 మిలియన్ పౌండ్లకు అమ్ముడు పోయింది. బోన్ హోమ్స్ చేసిన ప్రకటనలో అందరి అంచనాలను మించి రూ. 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Tipu Sultan Sword : రూ.144 కోట్లకు అమ్ముడు పోయిన టిప్పు సుల్తాన్ ఖడ్గం

London

Updated On : May 26, 2023 / 3:02 PM IST

Tipu Sultan Sword Auction  : లండన్‌లో జరిగిన వేలంలో టిప్పు సుల్తాన్ కత్తి 14 మిలియన్ పౌండ్ల (సుమారు 144 కోట్ల రూపాయలు)కు అమ్ముడుపోయింది. టిప్పు సుల్తాన్‌కి చెందిన అన్ని ఆయుధాల్లో ఈ కత్తికి అసాధారణమైన చరిత్ర ఉంది.

Tipu Sultan : బాలీవుడ్‌లో మరో బయోపిక్.. టిప్పు సుల్తాన్!

లండన్ లో జరిగిన వేలంపాటలో టిప్పు సుల్తాన్ కత్తి 14 మిలియన్ పౌండ్లకు అమ్ముడుపోయింది. ఇది 16వ శతాబ్దంలో భారతదేశానికి తీసుకువచ్చిన జర్మన్ బ్లేడ్ డిజైన్‌ను ఉపయోగించి మొఘలుల కాలంలో తయారు చేశారట. బోన్ హోమ్స్ చేసిన ఓ ప్రకటనలో కత్తి వేలం ధర సుమారుగా  14  మిలియన్ పౌండ్లుగా అంచనా వేశారు. ఈ కత్తికి అసాధారణమైన నాణ్యత ఉంది.

A poster featuring Tipu Sultan: టిప్పు సుల్తాన్ పోస్టర్‌ను చించి పడేసిన యువకులు.. ఉద్రిక్తత.. వీడియో

ఈ కత్తిపై భగవంతుని ఐదు గుణాలు, ప్రత్యేకంగా రెండు ప్రార్థనలు హిల్ట్ మీద బంగారు అక్షరాలతో చెక్కబడి ఉన్నాయి. కత్తిపై ‘పాలకుడి కత్తి’ అని రాసి ఉంటుంది. ఈ కత్తి తయారీ వెనుక ఆశ్చర్యపోయే ఆధారాలు, కత్తి నైపుణ్యం గురించి చరిత్ర దాగి ఉన్నాయి. ఇక కత్తి వేలంలో ఇద్దరు ఫోన్ బిడ్డర్లు, ఓ బిడ్డర్ మధ్య హాట్ హాట్ గా వేలంపాట జరిగింది.  టిప్పు సుల్తాన్ కత్తి  14 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోవడాన్ని మేము సంతోషిస్తున్నాము అని ఇస్లామిక్ మరియు ఇండియన్ ఆర్ట్ గ్రూప్ హెడ్ నిమా సాగర్చి చెప్పారు.