Tipu Sultan : బాలీవుడ్‌లో మరో బయోపిక్.. టిప్పు సుల్తాన్!

'టిప్పు' టైటిల్ తో ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయనున్నారు.

Tipu Sultan : బాలీవుడ్‌లో మరో బయోపిక్.. టిప్పు సుల్తాన్!

Tipu sultan Biopic Announced by EROS International films as Pan India Movie

Updated On : May 7, 2023 / 11:20 AM IST

Tipu Sultan :  టిప్పు సుల్తాన్ పూర్తి జీవిత కథ ఇప్పుడు బయోపిక్(Biopic) గా రానుంది. ఈ బయోపిక్ తో అతని పూర్తి కథని అందరికి పరిచయం చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ EROS ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సందీప్ సింగ్, రష్మీ శర్మ నిర్మాతలుగా పవన్ శర్మ దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రచయిత రాజత్ సేథీ టిప్పు సుల్తాన్ గురించి రీసెర్చ్ చేసి మరీ ఈ కథని సిద్ధం చేశాడు. తాజాగా ఈ సినిమా పోస్టర్ తో పాటు ఓ చిన్న గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

చిత్రయూనిట్ విడుదల చేసిన వీడియోలో.. టిప్పు సుల్తాన్ 8000 ఆలయాలను, 27 చర్చిలను కూల్చివేసినట్టు, 2000 బ్రాహ్మణ కుటుంబాలను నాశనం చేసినట్టు, 40 లక్షల మంది హిందువులను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చినట్టు, వారితో బలవంతంగా బీఫ్ తినిపించినట్టు, లక్షకు మందికి పైగా హిందువులను జైల్లో వేసినట్టు తెలిపారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక పోస్టర్ రిలీజ్ చేయగా ఈ పోస్టర్ లో టిప్పు సుల్తాన్ ఫేస్ మీద బ్లాక్ పెయింట్ వేసినట్టు చూపించారు. అయితే కొంతమంది నుంచి ఈ సినిమాపై వ్యతిరేకత వస్తుంది.

Heat Movie Review : ఒక్క రాత్రిలో జరిగే కథతో.. సస్పెన్స్ థ్రిల్లర్ గా మెప్పించిన హీట్..

‘టిప్పు’ టైటిల్ తో ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా ప్రకటనతోనే వివాదంలో నిలిచింది. మరి రిలీజ్ సమయానికి ఇంకెంత వివాదం సృష్టిస్తుందో చూడాలి.