కొత్త కొత్తగా 2020: న్యూ ఇయర్‌కి ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చెయ్యొచ్చు

2019కి గుడ్ బై చెప్పి 2020 కి స్వాగతం పలుకుతూ.. న్యూ ఇయర్ పార్టీని ఎలా చేసుకోవాలో ఆలోచిస్తున్నారా..? ఎప్పుడు ఉన్న ప్రదేశంలోనే చేసుకుంటే స్పెషల్ ఏముంటుంది.. ఈసారి కొత్తగా న్యూ ఇయర్ పార్టీని విదేశాలలో సెలబ్రేట్ చేసుకోండి. జీవితంలో ఒక్క సారైనా విదేశాలకు వెళ్లి రావాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి. అందుకే మీ దగ్గర డబ్బు ఉండాలే కానీ ఈసారి అద్భుతమైన 5విదేశాలకు వెళ్లి పార్టీ చేసుకోవచ్చు. మరి అవేంటో, వాటి అందాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామా?
* రియో, బ్రెజిల్:
న్యూ ఇయర్ ని బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే దక్షిణ అమెరికాలో ఉన్న బ్రెజిల్ దేశానికి వెళ్లండి. 2వేల సంవత్సరం నుంచి బ్రెజిల్ దేశం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందింది. అక్కడి అందాలు చూస్తే తిరిగి రావాలని కూడా అనిపించదు. బ్రెజిల్ దేశంలో యో డి జనెరియో, సావొ పాలో ఈ రెండు ప్రదేశాలను ప్రజలు ఎక్కువగా సందర్శిస్తుంటారు.
> బ్రెజిలియన్లు కోపాకాబానా బీచ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సూపర్ గా చేస్తారు. లాస్ట్ ఇయర్ ఇక్కడ రెండు మిలియన్ల మంది ప్రజలు పార్టీకి హాజరయ్యారని పిక్ యువర్ ట్రైల్ వ్యవస్థాపకుడు హరి గణపతి చెప్పారు.
* బెర్లిన్, జర్మనీ:
చుట్టూ నీళ్లు, మధ్యలో పచ్చని చెట్లు, ఎటు చూసినా నెమళ్లు… ఊహించుకుంటేనే అద్భుతంగా అనిపిస్తుంది కదా! మరి నిజంగా ఇలాంటి ప్రదేశానికి వెళ్లితే ఎలా ఉంటుంది. అయితే బెర్లిన్ నగరానికి దగ్గర్లో ఉన్న పికాక్ ఐలాండ్ కు మీరు కచ్చితంగా వెళ్లాల్సిందే. జర్మన్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మాములుగా చేయరు. డ్యాన్స్ లు, పాటలతో పార్టీలో రచ్చరచ్చ చేస్తారు.
* రికియవిక్, ఐస్ లాండ్:
ఐస్ లాండ్ దేశాల్లో న్యూ ఇయర్ సందడి అంతా ఇంతా కాదు.. ఇక్కడి దేశస్థులు తమ దేశాన్ని మంచు నేల అని పిలుస్తారు. పర్వతాలు, ఆవిరి కుండాలు ఇలా అన్నీ ఐస్ లాండ్లో కనిపిస్తాయి. ఇక్కడి ప్రకృతి అందాలకు తోడు అతి తక్కువ ఖర్చుతోనే వెళ్లొచ్చే అవకాశం ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఐస్‌లాండ్ కి క్యూ కడతారు.
> ఐస్ లాండ్.. ఐరోపాలోని ఓ చిన్న ద్వీపం. అందులో ఒకే ఒక్క పెద్ద నగరం రీక్ జవెక్. ఈ నగరం నుంచి ఏ పక్కకి ఓ పావుగంట ప్రయాణించిన ఓ సరస్సో, జలపాతమో, వేడినీటి బుగ్గో కనిపించి కనువిందు చేస్తుంది.
* ఎడిన్బర్గ్, స్కాట్లాండ్:
అందమైన కోటలు, ఆసక్తికరమైన సంగ్రహాలయాలు, భూగర్భ నగరం ఈ ఎడిన్బర్గ్.. ఇక్కడికి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఎడిన్బర్గ్ కోట ను సందర్శిస్తారు. ఈ కోట చాలాకాలం అంతరించిపోయిన అగ్నిపర్వతం. ఇది కేవలం పర్యాటక సందర్శన కోసం తెరిచి ఉంది. స్కాట్లాండ్ చాలా ఆసక్తికరమైన రంగుల దేశం. మీ జీవితంలో కనీసం ఒకసారైనా ఎడింబర్గ్ సందర్శించండి.
* న్యూజిలాండ్, సమోవ:
న్యూ ఇయర్ అంటేనే ప్రపంచమంతా సెలబ్రేషన్స్ లో మునిగి పోతుంది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచదేశాలు న్యూ ఇయర్ కు స్వాగతం పలుకుతాయి. ఇదివరకు న్యూజిల్యాండ్ ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోగా.. ఇప్పుడు మాత్రం సమోవ దేశం ఫస్ట్ న్యూఇయర్ చేసుకుంటుంది. కలర్ ఫుల్ న్యూఇయర్ తో అందర్లో జోష్ నింపుతుంది. ఇక న్యూజిలాండ్ లో న్యూ ఇయర్ వేడుకులు అంబరాన్నంటుతాయి. అంతేకాదు అక్కడ ఆక్లాండ్ బాణసంచా వెలుగులతో విరజిమ్ముతుంది.