భీకర తుఫాన్ : బస్సులెంటీ.. విమానాలే ఎగిరిపడ్డాయి
అతి భయంకరమైన సుడిగాలి ధాటికి ఓ ఎయిర్ పోర్ట్ అస్తవ్యస్తమైపోయింది. ఒక్క ఎయిర్ పోర్టే కాదు.. డజన్ల మంది ప్రజలు తీవ్రగాయాలపాలయ్యారు. అంతేకాదు.. పెద్ద పెద్ద బస్సులు, రన్ వే పై నిలిచిన విమానాలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి.

అతి భయంకరమైన సుడిగాలి ధాటికి ఓ ఎయిర్ పోర్ట్ అస్తవ్యస్తమైపోయింది. ఒక్క ఎయిర్ పోర్టే కాదు.. డజన్ల మంది ప్రజలు తీవ్రగాయాలపాలయ్యారు. అంతేకాదు.. పెద్ద పెద్ద బస్సులు, రన్ వే పై నిలిచిన విమానాలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి.
మీరు చూస్తుంది నిజమే. సినిమా గ్రాఫిక్స్ కాదు.. ప్రకృతి వైఫరిత్యం సృష్టించే బీభత్సం ఎలాంటి ఉంటుందో ఈ వీడియో ఒకసారి చూస్తే తెలుస్తుంది. అతి భయంకరమైన సుడిగాలి ధాటికి ఓ ఎయిర్ పోర్ట్ అస్తవ్యస్తమైపోయింది. ఒక్క ఎయిర్ పోర్టే కాదు.. డజన్ల మంది ప్రజలు తీవ్రగాయాలపాలయ్యారు. అంతేకాదు.. పెద్ద పెద్ద బస్సులు, రన్ వే పై నిలిచిన విమానాలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. బస్సులు అయితే ఏకంగా పల్టీలు కొడుతూ సుడిగాలికి కొట్టుకుపోయాయి. సైంటిఫిక్ సినిమా గ్రాఫిక్స్ తరహాలో కనిపిస్తున్న ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ భయంకర తుఫాన్ వచ్చింది ఇక్కడో ఎక్కడో కాదు.. టర్కీలోని అంటల్యా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో జరిగింది.
గ్రాఫిక్స్ కాదు.. రియల్ ఫిక్స్..
ఎయిర్ పోర్టులో విమానం కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్న సమయంలో ఒక్కసారిగా ప్రమాదకర స్థాయిలో పెద్ద సుడిగాలి దూసుకొచ్చింది. తుఫాన్ గాలి దెబ్బకు పెద్ద పెద్ద విమానాల ఎగిరిపడ్డాయి. బస్సులైతే పల్టీలు కొడుతూ దూరంగా కొట్టుకుపోయాయి. తుఫాన్ సృష్టించిన బీభత్సానికి ఎయిర్ పోర్టులో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో విమాన సర్వీసులను రద్దు చేయగా.. మిగతా విమానాలు 10 గంటలకు పైగా ఆలస్యమయ్యాయి. ఒణుకుపుట్టించే ఈ తుఫాన్ దృశ్యాన్ని అక్కడి ప్రయాణికుడు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో..