పైత్యం : క్రైస్ట్‌చర్చ్ దాడి ఇండియాలో జరగాలంట

క్రైస్ట్ చర్చ్‌లో జరిగిన దాడి ఇండియాలో కూడా జరగాలని సామాజిక మాధ్యమాల్లో పైత్యం ప్రదర్శించాడు ఓ ప్రబుద్దుడు. దీని ఫలితంగా అతడు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇటీవలే న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్‌లోని మసీదులో ఉన్మాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 50 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఎంతో మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
దుబాయ్..యూఏఈలో ట్రాన్స్‌గార్డ్ సెక్యూర్టీ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఫేస్ బుక్‌లో క్రైస్ట్ చర్చి దాడిపై పోస్టు చేశాడు. రోనీ సింగ్ అనే ఐడీతో దీనిని ఫేస్ బుక్‌లో పోస్టు చేశాడు. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన దాడి తరువాత పుల్వామాలో ఎటాక్‌లో చనిపోయిన వారి ఆత్మలు శాంతించి ఉంటాయి…అసలు ఇలాంటి తరహా దాడులు భారత్‌లోనూ జరగాలని పోస్టు చేశాడు. ఈ పోస్టును తరువాత ఫేస్ బుక్ తొలగించి వేసింది. వెంటనే స్పందించిన యాజమాన్యం తక్షణమే విధుల నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. యూఏఈ నుండి ఇండియాకు పంపించేసింది.