కరోనా వైరస్ బాధితులకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇస్తారు, ఏ వ్యాక్సిన్ వాడతారు

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 03:18 PM IST
కరోనా వైరస్ బాధితులకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇస్తారు, ఏ వ్యాక్సిన్ వాడతారు

Updated On : March 14, 2020 / 3:18 PM IST

వందకుపైగా దేశాల్లో కరోనా బాధితులున్నా ఇంతవరకు వ్యాక్సిన్ తయారు కాలేదు. రెండేళ్ల వరకు పట్టొచ్చని అంచనా. ఇప్పుడు ట్రీట్‌మెంట్ గురించి పరిశోధనలు సాగుతున్నాయి. ఇంతకీ కరోనా లక్షణాలు కనిపిస్తే… ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? 

ఇంతవరకు COVID-19కు క్యూర్ లేదు. యాంటీ బయోటిక్స్ తో ఉపయోగంలేదు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియల్ కాదు.
రోగ లక్షణాలు తీవ్రంగా ఉంటే …
1.డీహైడ్రేషన్ తగ్గించడానికి ఫ్లూయిడ్స్
2.జ్వరాన్ని తగ్గించడానికి మందులు
3.ఊపిరిపీల్చడంలో ఎక్కువ ఇబ్బందైతే ఆక్సిజన్ మాస్క్ లు, ఊపిరి పీల్చుకోవడంలో ఎక్కువ ఇబ్బందులైతే respirator అవసరం

ఎఫెక్టీవ్ ట్రీట్‌మెంట్‌ను కనిపెట్టడం కోసం ఏం చేస్తున్నారు?:
అందుబాటులో ఉన్న వ్యాక్సిన్, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ను COVID-19 నివారణ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తూనే ఉన్నారు. ఎవరు ఏ తరహా మందులను వాడుతున్నారు? ఏ మందు బాగా పని చేస్తోందో సమచారాన్ని వైద్య నిపుణులు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. కొన్ని మందులకు కరోనా లక్షణాలు తగ్గుతునట్లు నిపుణుల అంచనా. అయితే, వ్యాక్సిన్లు, ట్రీట్మెంట్ పద్ధతులను randomized controlled trials తర్వాతే రికమెండ్ చేయాల్సి ఉంది. అందుకోసం కనీసం నెలల సమయం పడుతుంది. చైనా నుంచి అమెరికా దాకా ప్రస్తుతం COVID-19 symptoms బాధితులకు వాడుతున్న కొన్ని ట్రీట్‌మెంట్లు ఇవి…

Remdesivir:
ఇది ప్రయోగాత్మక antiviral drug. Ebola చికిత్స కోసం తయారు చేసిన మందుది. కరోనా వైరస్ isolated cellsలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తోందని పరిశోధకులు కనిపెట్టారు. నిజానికి మనుషుల మీద ప్రయోగాలకు ఆమోదం లేదు. సమయం లేదు కాబట్టి, రెండు క్లినికల్ ట్రయిల్స్ చేసింది చైనా. ఒక పరీక్షకి అమెరికాలోని FDA అప్రూవ్ చేసింది. అమెరికా ఈ మందును వాడుతోందన్నది నిపుణుల మాట.

Chloroquine:
ఈ డ్రగ్ ను malaria, auto immune diseasesల కోసం వాడుతున్నారు. 70ఏళ్లుగా ఈ డ్రగ్ ను డాక్టర్లు రికమండ్ చేస్తున్నారు. ఇది సేఫ్. SARS-CoV-2 virusను ఎదుర్కోవడంలో డ్రగ్ బాగా పనిచేస్తోందని రిసెర్చ్ ల సమాచారం. అందుకే చైనా, ఇండియాలు ఈ డ్రగ్ ను ఎక్కువగా వాడుతున్నాయి. కోవిడ్ ను ఎదుర్కోవడానికి ఈ డ్రగ్ ఎంత ఎఫెక్టీవ్ గా పని చేస్తోందో తెలుసుకోవడానికి కనీసం 10 క్లినికల్ ట్రయిల్స్ సాగుతున్నాయి.

Lopinavir, ritonavir:
ఈ రెండింటిని Kaletra పేరు మీదుగా అమ్ముతున్నారు. వీటిని HIV ట్రీట్మెంట్ కోసం వాడతారు. తొలిసారి ఇండియాలోనూ ఈ డ్రగ్‌ను వాడారు. దక్షిణకొరియాలో 54 ఏళ్ల వ్యక్తికి ఈ డ్రగ్ తో కరోనాను నయం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ డ్రగ్స్ ను మిగిలిన కాంబినేషన్ తో కలసి వాడితే గొప్ప ప్రయోజనాలుంటాయని అంటోంది. అందుకే ఇండియా ఈ డ్రగ్స్‌తో ప్రయోగాలు మొదలుపెట్టింది.

APN01:
నోవల్ కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ఈ డ్రగ్ ప్రభావాన్ని అంచనా వేయడానికి చైనాలో ఇటీవలే క్లినికల్ ట్రయిల్స్ మొదలైయ్యాయి. 20 ఏళ్ల క్రితం డ్రగ్ ఇది. సార్స్ ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవడానికి ACE2 అన్న ప్రొటీన్ నుంచి తయారుచేశారు. ఈ ప్రొటీన్ respiratory distress నుంచి ఊపిరితిత్తులను రక్షిస్తుంది. సార్స్ లాంటి లక్షణాలున్నాయి కాబట్టి ఈ ఏస్2 ప్రొటీన్ రోగులకు ఎక్కిస్తున్నారు. 

Favilavir:
చైనా ఈ యాంటీ వైరల్ డ్రగ్ ను COVID-19 లక్షణాలను తగ్గించడానికి వాడుతోంది. నిజానికి ముక్కు. గొంతులో వాపును తగ్గించడానికి Favilavir వాడతారు. కరోనా లక్షణాల్లో కొన్ని ఇలాంటివే కాబట్టి… ఈ డ్రగ్ ఉపయోగపడుతోంది. ఫలితాలేంటో పూర్తిగా తెలియదు. కనీసం 70మందికిపైగా వాడితే వాళ్లలో రోగ లక్షణాలు తగ్గాయన్నది నిపుణలు మాట. ఒక్కో దేశం ఒక్కో డ్రగ్ మీద క్లీనికల్ ట్రయిల్స్ చూస్తూ ఫలితాలను అంతర్జాతీయంగా ఇచ్చి పుచ్చుకొంటోంది. ఇప్పుడు ఇండియా కూడా HIV డ్రగ్స్ ను వాడకం మొదలుపెట్టింది. ఫలితాలు తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయిలో చికిత్స విధానం ఖారారయ్యేంత వరకు ఇన్ని రకాల డ్రగ్స్ ను వాడక తప్పడం లేదు.