Truecaller : ట్రూ కాలర్ కీలక ప్రకటన.. ఇకపై ప్రీ-లోడ్ యాప్…

ఇప్పటివరకు ఈ యాప్ ను ప్లే స్టోర్ నుంచి ఇన్ స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. ఇకపై ప్రీలోడెడ్ యాప్ రూపంలో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్లలో ట్రూ కాలర్ యాప్ అందుబాటులోకి రానుంది.

Truecaller : ట్రూ కాలర్ కీలక ప్రకటన.. ఇకపై ప్రీ-లోడ్ యాప్…

Truecaller

Updated On : February 8, 2022 / 12:29 AM IST

Truecaller : ట్రూ కాలర్… కాలర్ ఐడెంటిఫికేషన్‌ యాప్‌.. ఏదైనా కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తే, ఈ యాప్ ద్వారా ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఈ యాప్ ను ప్లే స్టోర్ నుంచి ఇన్ స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. ఇకపై ప్రీలోడెడ్ యాప్ రూపంలో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్లలో ట్రూ కాలర్ యాప్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పలు ఆండ్రాయిడ్ ఫోన్ తయారీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ట్రూ కాలర్ వర్గాలు తెలిపాయి.

Tea Bags : టీ బ్యాగ్స్ వాడుతున్నారా?…మీ ఆరోగ్యం డేంజర్‌లో పడ్డట్టే…

అయితే, ప్రీలోడెడ్ గా తమ యాప్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, దాన్ని ఉపయోగించాలా? వద్దా? అనేది యూజర్ నిర్ణయించుకోవచ్చని ట్రూ కాలర్ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది ఫోన్లలో ప్రీలోడెడ్ యాప్ గా సేవలు అందించాలన్నది తమ ప్రణాళిక అని వివరించింది.

రాబోయే రెండేళ్లలో భారత్, ఇండోనేషియా, మలేషియా, లాటిన్ అమెరికా మార్కెట్లలో సుమారు 100 మిలియన్‌ కొత్త ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో ప్రీ-లోడెడ్‌ యాప్‌గా ఇవ్వడం లక్ష్యం పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. గతేడాదిలో ట్రూకాలర్ యూజర్లకు వీడియో కాలర్ ఐడీ, కాల్ రికార్డింగ్, ఘోస్ట్ కాల్, కాల్‌ అనౌన్స్ వంటి ఫీచర్లను పరిచయం చేసింది.

siddipet firing case : అప్పులు తీర్చటానికి దోపిడీలు..సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద కాల్పుల కేసు

‘‘ట్రూకాలర్ లేటెస్ట్ వెర్షన్ యాప్‌ ఇక మీదట విడుదలయ్యే స్మార్ట్‌ఫోన్లలో ప్రీ-ఇన్‌స్టాల్డ్‌ యాప్‌గా ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్లకు ఈ యాప్‌ను చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ట్రూకాల్‌ సీఈవో, వ్యవస్థాపకుడు అలెన్‌ మామెది తెలిపారు.

ప్రస్తుతం ట్రూకాలర్‌కు భారత్‌లో 450 మిలియన్ల మంది యూజర్లు ఉండగా, వారిలో 220 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు.