siddipet firing case :అప్పులు తీర్చటానికి దోపిడీలు..సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద కాల్పుల కేసు..నలుగురు అరెస్ట్

సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు అరెస్ట్ చేసి నగదు రికవరీ చేశారు.అప్పులు తీర్చటానికే దోపిడీలు చేస్తున్నారని సీపీ శ్వేత తెలిపారు.

siddipet firing case :అప్పులు తీర్చటానికి దోపిడీలు..సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద కాల్పుల కేసు..నలుగురు అరెస్ట్

Siddipet Police Cracks Firing Case At Sub Registrar Office

siddipet firing case at sub registrar office. :సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద నగదు బదిలీలు చేస్తుంటారు. కొన్నవారి అమ్మినవారికి డబ్బులు ఇస్తుంటారు. దీన్ని టార్గెట్ చేసుకున్న కొంతమంది దుండగులు అలా వచ్చి ఇలా డబ్బుల్ని దోచుకుపోతుంటారు. అడ్డం వస్తే తుపాకీతో బెదిరిస్తారు. కాల్పులు జరుపుతారు. అలా సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కాల్పులు జరిపి నగదు దోచుకుపోయిన నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.వారి నుంచి రూ.34 లక్షల నగదుని రికవరీ చేసామని..వారిపై కేసులు నమోదు చేసిన కోర్టులో హాజరుపరిచామని సీపీ శ్వేత తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దోపిడీ చేశారని తెలిపారు.ఈ కేసు దర్యాప్తులు పలు విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయని తెలిపారు. అప్పులు చేసి వాటిని తీర్చటం కోసం ఇలా దోపిడీలు చేస్తున్నారని తెలిపారు.

Also read : Siddipet: సిద్దిపేటలో సినీ ఫక్కీలో భారీ చోరీ.. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో గన్ ఫైర్!

వివరాల్లోకి వెళితే..తెలంగాణలోని సిద్ధిపేట సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కారు డ్రైవర్‌పై కాల్పులు జరిపి భారీగా నగదు దోచుకెళ్లిన ఘటన స్థానికంగా పెను సంచలనం రేపింది. కారు డ్రైవర్‌‌ని తుపాకీతో కాల్చి నిందితులు కారులో ఉన్న రూ.43.50 లక్షల నగదు దోపిడీ చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 15 స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించి పట్టుకున్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత మీడియాకు వివరాలు వెల్లడించారు.

జనవరి 31న సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారు డ్రైవర్‌పై కాల్పులు జరిపి కారులో ఉన్న రూ.43.50 లక్షలు దోచుకెళ్లారు. ఈ కేసులో ప్రధాని నిందితుడు సాయి.. అతనికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్టు చేసామని సీపీ చెప్పారు. నిందితులు వాడిన తుపాకీపై ఆరా తీస్తున్నామన్నారు. దోపిడీ ఘటనలోవాడిన బైక్ కూడా వారిది కాదని దాన్ని మరోచోటినుంచి దొంగిలించి తెచ్చారని తెలిపారు.

Also read : Siddipet 42 Lakhs Loot Case : 48 గంటలు గడిచినా దొరకని రూ.42 లక్షల చోరీ కేసు నిందితులు

అనుమానితుడిగా ఉన్న సాయిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడిందని..సీపీ తెలిపారు. నిందితులు చేసిన అప్పులు తీర్చటానికి ఇలా దోపిడీలు చేస్తున్నారని..చెప్పారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.34 లక్షల నగదుతో పాటు ఒక కారు, 2 బైకులు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. టెక్నాలజీ సాయంతో కేసును ఛేదించామని సీపీ తెలిపారు. దోచుకున్న మిగిలిన డబ్బుతో నిందితులు తమ అప్పులు తీర్చుకున్నాయని ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని తెలిపారు.

కాగా 2022 జనవరి 31న సిద్దిపేట నివాసి నర్సయ్య స్థలం రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. భూమి విక్రయించగా వచ్చిన రూ.43.50 లక్షలు కారులో పెట్టి సంతకం చేసేందుకు కార్యాలయంలోకి వెళ్లారు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన దుండగులు డ్రైవర్ రాములు గౌడ్ కాలిపై తుపాకీతో కాల్చి డబ్బుల బ్యాగును ఎత్తుకెళ్లారు. కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాల్పుల ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకుని అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.