వైట్‌హౌస్‌లో దీపావళి : వేడుకల్లో ట్రంప్

భారతీయుల పండుగల దీపావళిది ప్రత్యేక స్థానం. ఆనందాలు..వెలుగు జిలుగులతో చేసుకునే దీపావళి సందడి ప్రారంభమైపోయింది. ఈ దీపావళి పండుగ భారతీయుల కంటే ముందుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెడీ అయిపోయారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం అయిన వైట్ హౌస్ లో ట్రంప్ గురువారం (24.10.2019)న దీపావళి జరుపుకోనున్నారు.
భారత్ లో దీపావళి వేడుకలను జరుపుకోవడానికి మూడు రోజుల ముందే వైట్ హౌస్ లో సంబరాలు జరగనున్నాయి. 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా వైట్ హౌస్ లో దీపావళి వేడుకలను ప్రారంభించారు. 2017లో భారత సంతతి అమెరికా నేతలతో కలసి ట్రంప్ తొలి సారి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. గత ఏడాది దీపావళి వేడుకలకు అమెరికాలోని భారత రాయబారి నవతేజ్ సింగ్ ను ట్రంప్ ఆహ్వానించారు. దీపావళి వేడుకలను ట్రంప్ జరుపుకోనుండటం ఇది మూడోసారి కావటం విశేషం.
2018 సంవత్సరంలో వైట్ హౌస్ లోని రూజ్ వెల్డ్ రూమ్ లో జరిగిన దీపావళి వేడుకలకు ట్రంప్ అమెరికా భారత రాయబారి నవతేజ్ సింగ్ సర్నాను ఆహ్వానించారు. కాగా ఇప్పటికే టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ శనివారమే భారతీయులు..అమెరికా వాసులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో గవర్నర్ భవనంలో దీపావలను వెలిగించి వేడుకల చేసుకున్నామని..చీకటిపై వెలుగు సాధించిన విజయం గురించి..భారత ప్రధాని నరేంద్రమోడీ టెక్సాస్ పర్యటన గురించి చర్చించామని తెలిపారు.