అమెరికాలో ఎమర్జెన్సీ! : ట్రంప్ కీలక ప్రకటన

  • Published By: venkaiahnaidu ,Published On : January 19, 2019 / 06:28 AM IST
అమెరికాలో ఎమర్జెన్సీ! : ట్రంప్ కీలక ప్రకటన

Updated On : January 19, 2019 / 6:28 AM IST

అమెరికాలో కొనసాగుతున్న షట్ డౌన్ పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు(జనవరి 19, 2019) కీలక ప్రకటన చేయనున్నారు. శనివారం సాయంత్రం 3గంటలకు షట్ డౌన్ కీలక ప్రకటన చేస్తానని స్వయంగా ట్రంప్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా షట్ డౌన్ కు ప్రధాన కారణమైన మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణానంపై కూడా కీలక ప్రకటన చేయనున్నట్లు ట్రంప్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి నిధుల మంజూరు విషయంలో ప్రతిపక్ష డెమోక్రాట్లకు ట్రంప్ మధ్య ఘర్షణ షట్ డౌక్ కు దారితీసిన విషయం తెలిసిందే. షట్ డౌన్ కారణంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు అందక ఆకలితో అలమటిస్తున్నారు.

అంతేకాకుండా శుక్రవారం నుంచి ప్రభుత్వ విమాన సర్వీసులు కూడా నిలిపివేశారు. వైట్ హౌస్ అనుమతి లేకుండా చట్టసభల ప్రతినిధులు పర్యటనలు జరుపకుండా అడ్డుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నారు. ట్రంప్ కూడా తన దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆఫ్గాన్ పర్యటనకు కూడా సైనిక విమానం ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది.

అయితే ట్రంప్ గోడ నిర్మాణానికి నిధుల మంజూరు విసయంలో డెమోక్రాట్ల డిమాండ్లకు తలొగ్గేది లేదని, అవసరమైతే ఎమర్జెన్సీ కూడా విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఎమర్జెన్సీ విధించే హక్కు తనకుందని ఇప్పటికే ట్రంప్ సృష్టం చేశారు. అయితే ఈరోజు ట్రంప్ అమెరికాలో ఎమర్జెన్సీపై ఏమైనా ప్రకటన చేయనున్నారా అని, ఆ ప్రకటన మరేమయైనా ఉంటుందా అని అందరూ వేచిచూస్తున్నారు.