కరోనాతో అమెరికాలో లక్ష మంది చనిపోవచ్చు: ట్రంప్

తన అసమర్థత కారణంగా అమెరికాలో కరోనా వైరస్ వేగంగా విస్తరించింది అని విమర్శలు ఎదుర్కొంటున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఇటువంటి సమయంలోనే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ప్రస్తుతం అమెరికాలో దాదాపు సగం రాష్ట్రాలు నిబంధనల్ని సడలించాలని అనుకుంటుండగా.. అప్పుడే ఎకానమీ మళ్లీ పుంజుకుంటుందని ఆశిస్తున్నాయి. ట్రంప్ ఆలోచన కూడా ఇలాగే ఉంది. దేశం మొత్తాన్నీ మూసి ఉంచలేమని ఆయన ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు.
Also Read | వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే వచ్చిందనడానికి సాక్ష్యముంది..
ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) సోకి దాదాపు లక్ష మంది అమెరికన్లు మరణించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే మహమ్మారిని కట్టడి చేసేందుకు ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కూడా ధీమా వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ పురుద్ధరణ, వ్యాక్సిన్ తయారీ తదితర అంశాల గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ప్రాణాంతక వైరస్ పుట్టుకకు కారణమైన చైనా వల్లే ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లిందని ఆ దేశంపై మండిపడ్డారు.
కరోనా ధాటికి 75 లేదా 80 వేల నుంచి లక్ష మంది ప్రజలను మనం పోగొట్టుకోబోతున్నామని, ఇది చాలా భయంకరమైన విషమన్నారు ట్రంప్. ఇప్పటివరకు కరోనా కారణంగా 68వేల మంది చనిపోగా.. 11 లక్షల మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారని ట్రంప్ వెల్లడించారు. మరో 32 వేల మంది చనిపోతారని అన్నారు. ప్రస్తుతం అమెరికాలో రోజుకు వెయ్యి మంది చనిపోతున్నారు. ఈ లెక్క ప్రకారం మే నెలాఖరు వరకు లక్ష మరణాలు అవ్వొచ్చు అనేది అంచనా. అలాగే రోజూ 25 వేల మందికి పైగా కొత్తగా కరోనా బారిన పడుతున్నారు.
Also Read | కరోనా కేసుల్లో రష్యా రికార్డులు..ఒక్కరోజే 10వేలకు పైగా పాజిటివ్ కేసులు