ద్యావుడా..! : మిల్క్ డైరీలో పాలతో స్నానం..ఆ పాలే ప్యాకింగ్..!!

Turkey Milk dairy worker baths with milk : పొద్దున్న లేవగానే వేడి వేడిగా కాఫీయో..టీయో తాగందే ఏ పనిచేయబుద్ది కాదు. కాఫీయో టీయో తాగాలంటే పాలు కావాల్సిందే. పాలవాడు వేసి ప్యాకెట్ తీసుకుని గబగబా టీ పెట్టేసుకుంటాం.
ముఖ్యంగా సిటీల్లో పాలప్యాకెట్లే ప్రజలు ఎక్కువగా వాడుతుంటారు. మరి ఆ పాలు నిజంగా శుద్ధమైనవేనా? అనే డౌట్ మీకెప్పుడన్నా వచ్చిందా? ఇదిగో ఈ వీడియో చూస్తే తప్పకుండా వస్తుంది. ఇది చూశాక..ద్యావుడా మన కొనే పాల ప్యాకెట్లు ఇలా ప్యాక్ చేసినవా ఏంటీ? అనే డౌట్ వస్తుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకోండీ..
ఓ మిల్క్ డెయిరీలో పనిచేసే ఓ కార్మికుడు ప్యాక్ చేయాల్సిన పాలను ఓ టబ్ నిండా నింపుకున్నాడు. తరువా ఆ టబ్ లో దిగి చక్కగా ఆ పాలతో తనస్నానం చేశాడు. ఆతరువాత ఆ పాలనే చక్కగా ప్యాక్ చేసేశాడు. అతను పాలతో స్నానం చేస్తుంటే మరో కార్మికుడు దాన్ని వీడియో తీశాడు. టిక్ టాక్ లో ఈ వీడియో వైరల్ అయింది.
https://10tv.in/milk-atm-now-in-hyderabad-first-in-telangana/
అయితే అతడు స్నానం చేసిన పాలనే మళ్లీ ప్యాకెట్లలో నింపాల్సి ఉండడంతో ఆ వీడియో చూసిన జనాలు మండిపడుతున్నారు. ద్యావుడా యాక్..ఇటువంటి పాలనా మనం రోజు తాగేది పెరుగు చేసుకునేది అని అసహ్యించుకుంటున్నారు. జనాల ఆరోగ్యంతో ఇలా ఆటలాడుకుంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తుండడంతో అదికాస్తా పోలీసుల దృష్టికి వెళ్లింది. దాంతో వాళ్లు వెంటనే సదరు పాలతో స్నానంచేసిన ఘనుడ్ని అరెస్ట్ చేశారు. వీడియో తీసిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డైరీలో కార్మికులు ఏం చేస్తున్నారో పట్టించుకోని ఆ మిల్క్ డైరీ యాజమాన్ని మూసివేశారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే టర్కీలో..!!
Turkish worker arrested over milk bath in factory tank #Turkey https://t.co/e6sRfJoBUn pic.twitter.com/3C0A6c1Qrs
— Duvar English (@DuvarEnglish) November 6, 2020