షాకింగ్ : జపాన్ నౌకలో ఇద్దరు భారతీయులకు కొవిడ్ (కరోనా)

  • Published By: madhu ,Published On : February 12, 2020 / 05:51 PM IST
షాకింగ్ : జపాన్ నౌకలో ఇద్దరు భారతీయులకు కొవిడ్ (కరోనా)

Updated On : February 12, 2020 / 5:51 PM IST

షాకింగ్ న్యూస్..జపాన్ నౌకలో ఉన్న ఇద్దరు భారతీయులు కొవిడ్ – 19 (కరోనా వైరస్) బారిన పడ్డారు. యొకొహమా పోర్టులో డైమండ్ ప్రిన్సెస్ ఓడను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ గురించి తెలిసిన వెంటనే దీనిని ఆపివేశారు. అందులో ఇండియన్స్ కూడా ఉన్నారు. ఫిబ్రవరి 03వ తేదీ నుంచి వారు నౌకలో ఉండిపోయారు. తమను క్షేమంగా తీసుకెళ్లాలని భారతీయులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తం 3 వేల 711 మంది నౌకలో ఉన్నారు. ఇందులో 138 మంది భారతీయులున్నారు. 

తాజాగా భారతీయ సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్‌గా తేలినట్లు జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు ప్రకటించారు. ఇతరుల కూడా పరీక్షలు నిర్వహించారు. దీంతో అందరీలో టెన్షన్ మొదలైంది. జపాన్ హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం..వ్యాధి సోకిన వారికి చికిత్స అందించేందుకు ఆస్పత్రులకు తరలించినట్లు ప్రకటనలో వెల్లడించింది. 

చైనాలో ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. 
వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ దేశాలకు పాకింది.
గడిచిన వారం రోజుల్లోనే చైనాలో 500మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. చైనాలో 1100మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

జపాన్ నౌకలో ఉన్న అయిదుగురు భార‌తీయ సిబ్బంది మొఖానికి మాస్క్ లు ధరించి వీడియో ద్వారా ఓ మెసేజ్ పంపారు. 
కిచెన్ స్టాఫ్‌గా ప‌నిచేస్తున్న వారు.. త‌మ‌ను ఆదుకోవాలంటూ వేడుకున్నారు. 
హాంగ్‌కాంగ్‌కు చెందిన ఓ ప్ర‌యాణికుడు మొద‌ట క‌రోనా  ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలాడు.