Plane Crash:ఢీకొన్న వాయుసేన విమానాలు..ముగ్గురు మృతి

దక్షిణ కొరియా వైమానికి దళానికి చెందిన రెండు విమానాలు ఢీకొన్నాయి. శుక్రవారం (ఏప్రిల్ 1,2022) జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరొరకు తీవ్రంగా గాయపడ్డారు.

Plane Crash:ఢీకొన్న వాయుసేన విమానాలు..ముగ్గురు మృతి

South Korea Plane Crash

Updated On : April 1, 2022 / 2:31 PM IST

South Korea Plane Crash: దక్షిణ కొరియా వైమానికి దళానికి చెందిన రెండు విమానాలు ఢీకొన్నాయి. శుక్రవారం (ఏప్రిల్ 1,2022) జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరొరకు తీవ్రంగా గాయపడ్డారు. సచియాన్​ నగరానికి సమీపంలోని లోయ ప్రాంతంలో రెండు వాయుసేన విమానాలు కూలిపోయాయి అని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల కోసం మూడు హెలికాప్టర్లు, 20 వాహనాలు సహా పలువురు సిబ్బందిని తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

కేటీ-1 మోడల్​కు చెందిన ఈ విమానాలను శిక్షణ కోసం ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రైనింగ్ సమయంలో గాల్లోనే ఈ ప్రమాదం జరిగింది.ఈ విమానాల్లో ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరని తెలిపారు..ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో మరిన్ని వివరాల కోసం దర్యాప్తును కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. కాగా గత జనవరిలో కూడా దక్షిణ కొరియా వాయుసేనకు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. ఎఫ్​-5ఈ రకానికి చెందిన ఈ విమానం కొండను ఢీకొనడం వల్ల పైలట్​ ప్రాణాలు కోల్పోయాడు.