US Military Secrets : ఆ ఒక్క అక్షరం దోషం వల్ల అమెరికా రహస్యాలు రష్యా మిత్రదేశం చేతికి,ఆర్మీ సీక్రెట్స్‌, పాస్‌వర్డ్‌లతో సహా లక్షలాది ఈమెయిల్స్‌

ఆ ఒక్క అక్షరదోషం కాస్తా అమెరికా (America)కు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. ఒక్క అక్షరం అమెరికా ఆర్మీ రహస్యాల (US army secrets)తో పాటు పాస్ వర్డ్స్ (Passwords)తో సహా వేరే దేశానికి సెండ్ అయిపోయాయి.

US Military Secrets : ఆ ఒక్క అక్షరం దోషం వల్ల అమెరికా రహస్యాలు రష్యా మిత్రదేశం చేతికి,ఆర్మీ సీక్రెట్స్‌, పాస్‌వర్డ్‌లతో సహా లక్షలాది ఈమెయిల్స్‌

US Military Secrets

US Military Secrets : ఆ ఒక్క అక్షరదోషం కాస్తా అమెరికా (America)కు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. తెలుగులోనే కాదు ఇంగ్లీషులో కూడా ఒక్క అక్షరం తేడాతో ఎన్ని చిక్కులు వచ్చి పడతాయో ఇప్పుడు అమెరికా పరిస్థితి అలా తయారైంది. ఒక్క అక్షరం అమెరికా ఆర్మీ రహస్యాల (US army secrets)తో పాటు పాస్ వర్డ్స్ (Passwords)తో సహా వేరే దేశానికి సెండ్ అయిపోయాయి. పైగా ఆ దేశం కూడా అమెరికాకు శతృదేశంగా తయారైన రష్యా మిత్ర దేశమైన మాలి దేశానికి సెండ్ అయ్యాయి. టైపింగ్ చేసే సమయంలో వచ్చిన చిన్నపాటి పొరపాటు కాస్తా అమెరికా కొంప మంచేలా తయారైంది పరిస్థితి..!!

అమెరికా సైన్యానికి వెళ్లాల్సిన ఈమెయిల్స్ కాస్తా కీబోర్డులో కొట్టాల్సిన ఒకే ఒక్క అక్షరం మార్పుతో రష్యా మిత్రదేశం మాలి(Mali)కి చేరుకున్నాయి. ఈ మెయిల్స్ లో అమెరికాకు చెందిన అత్యంత రహస్యాలు కూడా ఉన్నాయి. అమెరికాకు చెందిన సైనిక రహస్యాలు, మ్యాప్‌లు, పాస్‌వర్డ్‌లు ఉన్న లక్షల కొద్దీ ఈమెయిల్స్‌ రష్యా(Russia) మిత్రదేశమైన మాలి చేతికి అందాయి. దీనికి కారణం ఒకే ఒక్క చిన్నపాటి టైపింగ్‌ తప్పు వల్లే జరిగింది.

అమెరికా సైన్యం తమ టీమ్ కమ్యూనికేషన్స్ కోసం ‘MIL’ అనే ఎక్స్‌టెన్షన్‌ ఉన్న డొమైన్‌ ఉపయోగిస్తుంది. చాలా సందర్భాల్లో అమెరికా సైన్యంలోని వారు మెయిల్‌ చేసే సమయంలో పొరబాటున .ML అని టైపు చేసేవారు. దీంతో ఆ మెయిల్స్‌ మొత్తం మాలి డొమైన్‌కు సెండ్ అయ్యాయి. అలా వెళ్లినవాటిలో అమెరికా ఆర్మీ చీఫ్‌ పర్యటనలో విడిది చేసిన హోటల్ రూమ్ నంబర్లతో సహా అన్ని పొందుపరచబడి ఉన్నాయి. మిలటరీ సిబ్బంది. ట్రావెల్ ఏజెంట్లు, యూఎస్ ఇంటెలిజెన్స్, ప్రైవేటు కాంట్రాక్టర్లు వంటివన్నీ ఉన్నాయి.

ఈ విషయాన్ని మాలి డొమైన్‌ నిర్వహణ బాధ్యతలు చూసే జోహన్నస్‌ జూర్బిర్‌ అనే డచ్‌ వ్యాపారవేత్త (Dutch internet entrepreneur Johannes Zuurbier )వెలుగులోకి తెచ్చారు..యూఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించటానికి పదే పదే యత్నించారు. అలా పదేళ్ల నుంచి అమెరికా సైన్యం నుంచి లక్షల సంఖ్యలో మెయిల్స్‌ వచ్చినట్లు గుర్తించారు. మొదట్లో తమ డొమైన్ లో లేని మెయిల్స్ అడ్రస్ లకు కూడా .ML ఎక్స్‌టెన్షన్‌తో మెయిల్స్‌ రావడాన్ని గమనించారు. ఆ తరువాతే అతనికి అర్థమైంది అవి పొరపాటున వస్తున్నాయని గుర్తించారు. దీంతో ఇటువంటి మెయిల్స్‌ను ఓ చోటకు చేర్చడానికి అతను ఓ ప్రత్యేక సిస్టమ్ ను క్రియేట్ చేశారు.

2023 జనవరి నుంచి ఇటువంటివి 1,17,000 ఈమెయిల్స్‌ వచ్చాయి. గత బుధవారం కూడా దాదాపు 1,000 మెసేజ్ లు వచ్చాయి. వీటిలో అమెరికా సైన్యానికి సంబంధించిన మ్యాప్ లు, సంబంధిత పాస్ వర్డ్స్, ఆఖరికి సైనికుల మెడికల్ రికార్డులు, వారి స్థావరాల్లో ఫోటోలు, స్థావరాల్లో ఉండే సిబ్బంది ఎంతమంది ఉన్నారు అనే పలు కీలకమైన విషయాలు అత్యంత విపులంగా ఉన్నాయి. అంతేకాదు అమెరికా సైనికుల మెడికల్‌ రికార్డులు, నౌకాదళ కదలికలు, నౌకల్లో సిబ్బంది వివరాలు, పన్ను వివరాలు వంటి అత్యంత సున్నితమై సమాచారాలున్నాయి. మెయిల్స్‌ దారి మళ్లుతున్న విషయంపై అతడు చాలా సార్లు అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Elon Musk Tesla : మరోసారి వార్తల్లో టెస్లా.. తీసుకున్న జీతాల్ని తిరిగి ఇచ్చేస్తామంటున్న డైరెక్టర్లు, ఆ మొత్తం ఎంతో తెలుసా..?

వీటిల్లో అమెరికా సైనిక సిబ్బంది, సైన్యంతో కలిసి పనిచేసే ట్రావెల్‌ ఏజెంట్లు, ఇంటెలిజెన్స్ సిబ్బంది, ప్రైవేటు కాంట్రాక్టర్లు, ఇతరులు పంపిన మెయిల్స్ అధికంగా ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం అమెరికా ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ జేమ్స్‌ మెక్‌కాన్వెలీ (US Army Chief of Staff General James McConnell )ఇండోనేషియా(Indonesia)లో పర్యటించారు. ఆ పర్యటనలో ఆయన బసచేసిన రూమ్‌ నంబర్ల సంఖ్యలతో సహా ఉన్న ఈమెయిల్‌ కూడా దారి మళ్లింది. దీనిలో గ్రాండ్‌ హయత్‌ జకార్తలోని రూమ్‌ కీ కలెక్షన్‌ కూడా ఉన్నట్లు సమాచారం.

ఇవి రష్యాకు చిక్కితే ముప్పే..
ప్రస్తుతం యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంట్లో భాగంగానే యుక్రెయిన్ కు ఆయుధాలను సరఫరా చేస్తోంది. దీంతో అమెరికా వర్సెస్ రష్యా అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఈక్రమంలో అమెరికాకు చెందిన ఇంత కీలకమైన..సున్నితమైన సమాచారం రష్యా చేతికి చిక్కితే ఇక పుతిన్ అమెరికాను ఓ ఆటాడుకునే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉంటే మాలి ప్రభుత్వంతో జోహన్నస్‌ జూర్బిర్‌ కాంట్రాక్టు సోమవారం (జులై,2023)తో ముగిసింది. దీంతో మాలి ప్రభుత్వమే నేరుగా ఈ డొమైన్‌ను ఆధీనంలోకి తీసుకొంది. దీంతో దారిమళ్లిన అమెరికా ఈమెయిల్స్ ఆ దేశం సిబ్బంది చూసే అవకాశం ఉంది. ఇప్పటికే రష్యాకు చెందిన వాగ్నర్‌ (Wagner) గ్రూప్‌ 2022 నుంచి మాలిలోనే ఉంది. యుక్రెయిన్ యుద్ధానికి అవసరమైన కీలక యంత్రాలను రవాణా చేయడానికి దీనిని కీలక మార్గంగా వాడుకొంటోంది.

United Nation: హిందీ భాష విస్తృతి కోసం ఐక్యరాజ్య సమితికి రూ.8 కోట్లు ఇచ్చిన భారత్

నిజం చెప్పాలంటే వాగ్నర్ గ్రూప్ కు ప్రధాన ఆయుధం సైబర్ దాడులు చేయటం. అటువంటి వాగ్నర్ గ్రూప్ చేతికి ఇవి దక్కితే అమెరికా చుక్కలు చూడాల్సిందే. దీన్ని అవకాశంగా తీసుకుని దేనికైనా తెగించే అవకాశాలున్నాయి. మరోవైపు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పెంటగాన్ ప్రతినిధి లెఫ్టినెంట్ కమాండర్ టామ్ గోర్మన్ తెలిపారు. .MILకు వెళ్లకుండా మాలి డొమైన్‌కు వెళుతున్న ఈమెయిల్స్‌ను బ్లాక్‌ చేసారని తెలిపారు.