2009 తర్వాత పుట్టిన వాళ్లు సిగరెట్లు బ్యాన్.. తాగడం, అమ్మడం అన్నీ నేరం.. చరిత్రాత్మక బిల్లుకు గ్రీన్ సిగ్నల్
UK bans smoking : బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి వెస్ స్ట్రీటింగ్ (Wes Streeting) మాట్లాడుతూ.. ఈ తరం వ్యసనం, హాని నుండి తప్పించుకుని, ప్రొగ తాగని మొట్టమొదటి తరంగా నిలుస్తుందని అన్నారు.
UK bans smoking for people born after 2008
- బ్రిటన్ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం
- భవిష్యత్ తరాలను పొగాకు రహితంగా మార్చేందుకు చట్టం
- చారిత్రక బిల్లుకు యూకే పార్లమెంట్ ఆమోదం
UK bans smoking : ‘పొగ రహిత తరాన్ని’ సృష్టించే లక్ష్యంతో బ్రిటిష్ పార్లమెంట్ ఒక చారిత్రాత్మక చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం.. 2009 జనవరి 1వ తేదీ లేదా ఆ తరువాత జన్మించిన వారు తమ జీవితాంతం పొగాకు ఉత్పత్తులను చట్టబద్దంగా కొనుగోలు చేయలేరు. పొగాకు, వేప్స్ బిల్లు పార్లమెంటరీ ప్రక్రియలన్నింటినీ పూర్తి చేసుకొని రాజ ఆమోదం పొందింది. దీంతో ఇప్పుడు అది చట్టంగా మారింది.
ధూమపానాన్ని అరికట్టడానికి బ్రిటన్ చాలా కఠినమైన చర్యలు తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం 17 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు కలిగిన వారు భవిష్యత్తులోనూ సిగరేట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను అధికారికంగా కొనుగోలు చేయలేరు. కొత్త తరాన్ని పొగాకు శాశ్వతంగా దూరం చేయాలనే లక్ష్యంతో బ్రిటన్ పార్లమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం 2024లో ఈ బిల్లును ప్రవేశపెట్టి, దానిని తన అత్యంత ప్రాధాన్యతలలో ఒకటిగా పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం, ఈ చట్టం 2027 జనవరి 1న అమల్లోకి వస్తుంది.
వయస్సును బట్టి చట్టం వర్తిస్తుంది..
♦ జనవరి 1, 2027 నుండి, పొగాకు కొనుగోలు చేయడానికి కనీస వయస్సు ప్రతి సంవత్సరం 1 సంవత్సరం చొప్పున పెరుగుతుంది.
♦ అంటే 2027లో వయోపరిమితి 18 ఏళ్లు అయితే, 2028లో 19 ఏళ్లు, 2029లో 20 ఏళ్లు అవుతుంది.
♦ 2009లో లేదా ఆ తర్వాత జన్మించిన వారు ఎప్పటికీ చట్టబద్ధంగా సిగరెట్లను కొనుగోలు చేయలేరు.
♦ దుకాణదారులు ప్రతి కస్టమర్ వయస్సును తనిఖీ చేస్తారు. మైనర్లకు సిగరెట్లు అమ్మితే జరిమానా విధించబడుతుంది.
♦ పొగాకు అమ్మేవారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి, కాగా ప్రకటనలు, ప్రచారం ఖచ్చితంగా నిషేధించబడతాయి.
♦ వేపింగ్ (ఇ-సిగరెట్లు) పై కూడా కఠిన చర్యలు విధించారు.
♦ పాఠశాలలు, ఆస్పత్రులు, పిల్లల ఆట స్థలాల్లో ధూమపానం పూర్తిగా నిషేధించబడుతుంది. అనేక ఇండోర్ ప్రదేశాల్లో కూడా వేపింగ్ నిషేధించబడుతుంది. 18ఏళ్లలోపు వారితో కలిసి కారులో వేపింగ్ చేయడం కూడా చట్ట విరుద్ధం
బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి వెస్ స్ట్రీటింగ్ మాట్లాడుతూ.. ఈ తరం వ్యసనం, హాని నుండి తప్పించుకుని, ప్రొగతాగని మొట్టమొదటి తరంగా నిలుస్తుందని అన్నారు. వ్యాధికి చికిత్స చేయడం కంటే దానిని నావారించడమే ఉత్తమమని ఆయన చెప్పారు. దీనివల్ల ప్రొగతాగని తరం ఏర్పడుతుందని, ప్రొగతాడం వల్ల కలిగే అనారోగ్యాలు, మరణాలు తగ్గుతాయని ప్రభుత్వం చెబుతోంది.
