PM Boris Johnson : అతడో యుద్ధ నేరస్తుడు.. పుతిన్‌పై బ్రిటన్ ప్రధాని ఫైర్
పుతిన్ ను యుద్ధ నేరస్తుడిగా అభివర్ణించారు బోరిస్ జాన్సన్(PM Boris Johnson). పుతిన్ నాయకత్వంలోని రష్యా... యుక్రెయిన్ లో ఇప్పటికే పలు యుద్ధ నేరాలకు..

Boris Johnson
PM Boris Johnson : సైనిక చర్య పేరుతో యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్(PM Boris Johnson) ఫైర్ అయ్యారు. పుతిన్ ను యుద్ధ నేరస్తుడిగా అభివర్ణించారు బోరిస్ జాన్సన్. పుతిన్ నాయకత్వంలోని రష్యా… ఉక్రెయిన్ లో ఇప్పటికే పలు యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. అమాయక పౌరులపై బాంబులు వేస్తున్నారని వాపోయారు.
రష్యా యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం దర్యాప్తునకు బ్రిటన్ చట్టసభల సభ్యులందరూ మద్దతివ్వాలని బోరిస్(Boris Johnson) పిలుపునిచ్చారు. “యుక్రెయిన్ లో రష్యా ముమ్మాటికీ యుద్ధ నేరాలకు పాల్పడింది. పుతిన్ నేరాలను అందరూ చూశారు. అవి కచ్చితంగా యుద్ధ నేరాలే అవుతాయి. క్రిమినల్ న్యాయస్థానం ప్రాసిక్యూటర్ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించి ఉంటారు. బ్రిటన్ రాజకీయ పక్షాలన్నీ మద్దతిస్తాయని భావిస్తున్నాను” అని బోరిస్ జాన్సన్ అన్నారు. కాగా, యుక్రెయిన్ లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందన్న ఆరోపణలపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ప్రాసిక్యూటర్ దర్యాప్తుకు సిద్ధమైంది.
Indian Student Death: యుక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్థి మృతి
ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా, కఠిన ఆంక్షలు విధిస్తున్నా…రష్యా మాత్రం వెనక్కితగ్గడం లేదు. వరుసగా 7వ రోజూ యుక్రెయిన్ పై దాడులు చేసింది రష్యా. యుక్రెయిన్ లోని ప్రధాన నగరాలను రష్యా సేనలు టార్గెట్ చేశాయి. ఆ ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. కాగా, మూడో ప్రపంచ యుద్ధమే జరిగితే అది అణు యుద్ధమే అవుతుందని రష్యా విదేశాంగ మంత్రి ప్రపంచ దేశాలను హెచ్చరించారు. గత వారం రోజులుగా యుక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా.. ప్రపంచ దేశాల ఆంక్షలను సైతం లెక్కచేసే స్థితిలో లేదు. పైగా ఇతర దేశాలు ఈ యుద్ధంలో కలగజేసుకుంటే చరిత్రలో ఎన్నడూ చూడని పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. భయాందోళనకు గురైన ప్రపంచ దేశాలు.. రష్యాను ఎదిరించలేక మిన్నకుండిపోయాయి. దీంతో యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర అప్రతిహతంగా సాగుతోంది.
Putin: 10 వేల డాలర్ల కంటే ఎక్కువ డబ్బుతో దేశం దాటి వెళ్లకుండా నిషేధం విధించిన పుతిన్
యుక్రెయిన్ లోని కీవ్, ఖార్కివ్ వంటి ప్రధాన నగరాలు చేరుకున్న రష్యా బలగాలు.. అక్కడి భవనాలను నేలమట్టం చేస్తున్నాయి. ఆయా నగరాల్లోని యుక్రెయిన్ సైనిక స్థావరాలను కూల్చివేశాయి. యుక్రెయిన్ అక్రమణే లక్ష్యంగా ఇప్పటికే కీవ్ నగరం సరిహద్దుల్లో వేలాది మంది రష్యన్ సైనికులు పాగావేసినట్లు అమెరికా నిఘావర్గాలు పంపిన శాటిలైట్ చిత్రాలు ద్వారా తెలుస్తుంది. కీవ్ నగరానికి సమీపంలో 65 కిలోమీటర్ల మేర అత్యాధునిక ఆయుధాలతో కూడిన రష్యా సైన్యం తిష్టవేసుకుని ఉంది. ఈ క్రమంలో కీవ్ నగరంలో రష్యా అణు దాడి చేయనుందని అమెరికా నిఘావర్గాలు భావిస్తున్నాయి. రష్యా చర్యలను తిప్పికొట్టేందుకు యుక్రెయిన్ సైతం తమ మిత్ర దేశాల నుంచి అణు బాంబులను తెప్పించి ప్రయోగించేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాల్లో పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ ప్రధాన నగరం ఖార్కివ్‌లోని భారత పౌరులు, విద్యార్థులకు యుక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన జారీ చేసింది. ఉన్నపళంగా ఖార్కివ్‌ను వదలాలని తేల్చి చెప్పింది. రవాణ సౌకర్యం లేకపోయినా కాలినడకన అయినా సరే.. వెంటనే ఖార్కివ్ ను ఖాళీ చేయాల్సిందే అని భారతీయులకు స్పష్టం చేసింది.