Blood Cells Grown In Laboratory : ల్యాబ్‌లో రక్తం తయారు.. శరీరం బయట తొలిసారి

యూకే శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. శరీరం బయట తొలిసారి ల్యాబ్‌లో రక్తాన్ని తయారు చేశారు. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను శరీరానికి సరఫరా చేసే ఎర్ర రక్త కణాలపై దృష్టి సారించారు. ముందుగా ఎర్ర రక్త కణాలుగా మారే మూల కణాలను సేకరించి వాటిని ల్యాబ్‌లో పెద్ద మొత్తంలో పెరిగేలా చేశారు.

Blood Cells Grown In Laboratory : ల్యాబ్‌లో రక్తం తయారు.. శరీరం బయట తొలిసారి

blood cells grown in laboratory

Updated On : November 8, 2022 / 7:14 AM IST

Blood Cells Grown In Laboratory : యూకే శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. శరీరం బయట తొలిసారి ల్యాబ్‌లో రక్తాన్ని తయారు చేశారు. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను శరీరానికి సరఫరా చేసే ఎర్ర రక్త కణాలపై దృష్టి సారించారు. ముందుగా ఎర్ర రక్త కణాలుగా మారే మూల కణాలను సేకరించి వాటిని ల్యాబ్‌లో పెద్ద మొత్తంలో పెరిగేలా చేశారు.

మూడు వారాలకు 5 లక్షల మూల కణాలు.. 5 వేల కోట్ల ఎర్ర రక్త కణాలుగా మారాయి. వాటిని శుద్ధి చేయగా, 1500 కోట్ల ఎర్ర రక్త కణాలు ట్రాన్స్‌ప్లాంట్‌కు పనికొచ్చాయి. ట్రయల్స్‌లో భాగంగా తొలిసారిగా ఇద్దరికి ఈ రక్తాన్ని ఎక్కించి పరీక్షిస్తున్నారు.

Cholesterol : రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదు ఏ స్ధాయికి చేరితే ప్రమాదకరం?

కొన్ని గ్రూప్‌ల రక్తం చాలా అరుదని.. ఆ బ్లడ్‌ గ్రూప్‌లు ఉన్నవారికి రక్తం దొరక్కపోతే ప్రాణాలకే ప్రమాదమని బ్రిటన్‌కు చెందిన ఎన్‌హెచ్‌ఎస్‌ బ్లడ్‌ అండ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ మెడికల్‌ డైరెక్టర్‌ ఫారుక్‌ షా పేర్కొన్నారు. అందుకే రక్త దానంపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ ప్రయోగం చేపట్టామని వెల్లడించారు.