Ukraine Russia War : మరింత భీకరంగా వార్.. కీవ్, ఖర్కిన్ లోకి ప్రవేశించిన రష్యా బలగాలు

కీవ్‌, ఖర్కీవ్‌, ఒడెస్సా, మారియాపోల్‌ తదితర నగరాలతోపాటు నల్ల సముద్రం, నీపర్‌ నదికి అనుసంధానించే ఖెర్సాన్‌ ప్రాంతంపైనా రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి.

Ukraine Russia War : మరింత భీకరంగా వార్.. కీవ్, ఖర్కిన్ లోకి ప్రవేశించిన రష్యా బలగాలు

Ukraine (2)

Ukraine Russia war : యుక్రెయిన్‌-రష్యా మధ్య రెండోరోజు యుద్ధం మరింత భీకరంగా సాగింది. రష్యా ముప్పేట దాడులతో విరుచుకుపడింది. పలు నగరాలు, సైనిక స్థావరాలపై మూడు వైపుల నుంచి పదాతిదళాలు, యుద్ధట్యాంకులతో అటాక్ చేసింది. రాజధాని కీవ్‌, రెండో పెద్దనగరం ఖర్కివ్‌తో పాటు పలు పట్టణాల్లోకి ప్రవేశించిన పుతిన్‌ సేనలతో యుక్రెయిన్ బలగాలు ఉద్ధృతంగా పోరు సాగించాయి. ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల నుంచి ప్రవేశించిన పుతిన్‌ సేనలు.. కీలక, వ్యూహాత్మక ప్రాంతాల వైపు కదులుతున్నాయి. వారిని నిలువరించేందుకు ప్రజలకు ఆయుధాలిచ్చిన యుక్రెయిన్‌ సైన్యం… రష్యా బలగాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది.

కీవ్‌, ఖర్కీవ్‌, ఒడెస్సా, మారియాపోల్‌ తదితర నగరాలతోపాటు నల్ల సముద్రం, నీపర్‌ నదికి అనుసంధానించే ఖెర్సాన్‌ ప్రాంతంపైనా దాడులు చేస్తున్నాయి రష్యా బలగాలు. యుక్రెయిన్‌ ఆర్థిక కార్యకలాపాలను కట్టడి చేసేలా… కీలకమైన ఒడెస్సా పోర్టుపైనా పట్టు బిగించాయి. మాస్కో బలగాలు రెండో రోజు తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ నగరం నడిబొడ్డుకు చేరుకోవటంతోపాటు రెండో అతిపెద్ద నగరం ఖర్కివ్‌లోకి ప్రవేశించాయి.

UN Security Council : రష్యాకు వ్యతిరేకంగా ఐరాసా భద్రతా మండలిలో తీర్మానం.. వీగిపోయిన తీర్మానం

యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఇప్పటికే అడుగుపెట్టిన రష్యన్ దళాలు.. ఇపుడు ఆ దేశంలో రెండో అతిపెద్ద పట్టణమైన ఖార్కివ్‌పై కన్నేశాయి. ఆ సిటీలోకి ఎంటరయ్యేందుకు బాంబు దాడులు చేశాయి. మిస్సైళ్ల వర్షం కురిపించాయి. వాహనాల్లో వెళ్తున్న వారి పక్కనుంచే రాకెట్లు దూసుకెళ్తున్నాయి. అంతేకాదు ఆ పట్టణంలోని నేషనల్ గార్డ్ అకాడమీకి సమీపంలో నడిరోడ్డుపై పడిపోయిన రాకెట్లు కనిపిస్తున్నాయి. ఖార్కివ్‌ను హస్తగతం చేసుకున్న రష్యా దళాలు…ఇప్పుడు సుమీ నగరం మీదుగా కదులుతున్నాయి.

సైనిక చర్యతో దూసుకుపోతున్న రష్యాకు.. యుక్రెయిన్ నుంచి గట్టి ప్రతిఘటనే ఎదురవుతోంది. దీంతో రష్యా సైతం పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో కనిపిస్తున్న దృశ్యాలు అత్యంత హృదయవిదారకంగా ఉన్నాయి. కీవ్‌ పట్టణంలోని చాలాచోట్ల రష్యా సైనికుల మృతదేహాలు పడి ఉన్నాయి. అవికూడా చాలాభాగం కాలిపోయి ఉన్నాయి. ఆ మృతదేహాలను వీడియో రికార్డు చేస్తున్న యుక్రెయిన్‌ సైనికులు.. మీరు మా భూమిపై అడుగుపెడితే ఇలాగే జరుగుతుందంటూ వాటిని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తున్నారు.

Russia – Ukraine: యుక్రెయిన్ ఆర్మీలో జాయిన్ అయ్యేందుకు నేను సైతం అంటోన్న 80ఏళ్ల వ్యక్తి

రెండోరోజు యుద్ధంలో యుక్రెయిన్‌కు చెందిన ఓ సైనికుడు హీరోగా నిలిచాడు. రయ్యిమని దూసుకువస్తున్న రష్యా ఎయిర్‌క్రాఫ్ట్‌లను వరుసగా నేలకూల్చాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆరు రష్యా ఫైటర్‌ జెట్ల పని పట్టాడు. చక్ నోరిస్ అనే సైనికుడు.. కీవ్‌పై అటాక్ చేసేందుకు వచ్చినవారికి చుక్కలు చూపించాడు. ది ఘోస్ట్ ఆఫ్ కీవ్‌గా పిలవబడే యుక్రెయిన్ జెట్ ద్వారా… రష్యా సైనిక విమానాలను కూల్చివేశాడు. 30 గంటల పాటు నిర్విరామంగా యుద్ధ విమానం నడిపిన ఆ పైలట్‌… ఇపుడు యుక్రెయిన్‌కు హీరోగా మారిపోయాడు.

రష్యా దండయాత్రను ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ వాసులు మేము సైతం అంటూ కదనరంగంలోకి దూకుతున్నారు. ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు సైనిక పాత్ర పోషిస్తుండగా.. అతడిని చూసి స్పూర్తిపొందిన మరికొందరు నాయకులు సైతం యుద్ధభూమిలో పోరుబాటకు రెడీ అవుతున్నారు. తాజాగా యుక్రెయిన్‌ మహిళా ఎంపీ కూడా తుపాకీ చేతపట్టుకుని పోరాడానికి రెడీ అయ్యారు. చట్ట సభల్లో వాయిస్ వినిపించడమే కాదు.. అవసరమైతే ఆయుధం చేతపట్టి పోరాడటం తెలుసని నిరూపిస్తున్నారు. పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా పోరాడుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.