Robot Lawyer : తొలిసారి రోబో న్యాయవాది.. ఎక్కడో తెలుసా?

ఇకనుంచి రోబో న్యాయ వాదులు కూడా రాబోతున్నాయి. కోర్టుల్లో మానవ న్యాయవాదులతోపాటు రోబో న్యాయవాదులు కూడా కేసులను వాదించనున్నాయి. ఇకపై రోబో న్యాయవాది తొలిసారి కోర్టులో వాదించనుంది.

Robot Lawyer : తొలిసారి రోబో న్యాయవాది.. ఎక్కడో తెలుసా?

robot lawyer

Updated On : January 8, 2023 / 12:33 PM IST

robot lawyer : ఆధునికయుగంలో టెక్నాలజీ పెరిగింది. సాంకేతికతను ఉపయోగించి అనేక పరికరాలను తయారు చేస్తున్నారు. ఇంతకముందు రోబోలను తయారు చేసి మనుషులు చేసే వివిధ పనులను వాటితో చేయిస్తున్నారు. ఇకనుంచి రోబో న్యాయ వాదులు కూడా రాబోతున్నాయి. కోర్టుల్లో మానవ న్యాయవాదులతోపాటు రోబో న్యాయవాదులు కూడా కేసులను వాదించనున్నాయి. త్వరలో రోబో న్యాయవాది తొలిసారి కోర్టులో వాదించనుంది. అయితే ఇది నమ్మశక్యంగా లేకున్నా త్వరలో వాస్తవం రూపం దాల్చనుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో రూపొందించిన రోబో న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించనుంది. దీంతో ద్వారా కోర్టు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని దానిని తయారు చేసిన అమెరికాకు చెందిన డునాట్ పే సంస్థ పేర్కొంది. కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించిన ఈ రోబో న్యాయవాది ఫిబ్రవరిలో కోర్టులో తొలిసారి కేసు వాదించనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఏ కోర్టులో ఎవరిపై వాదిస్తుందన్న విషయాన్ని మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు.

Killer Robots : నేరస్థులను చంపటానికి ‘రోబో’ పోలీసులు .. ఎక్కడంటే..

అయితే ఈ రోబో న్యాయవాది స్మార్ట్ ఫోన్ సహకారంతో పని చేస్తుందని న్యూ సైంటిస్టు తెలిపింది. కోర్టుల వాదనాలు విన్న తర్వాత ఏం వాదించాలన్నది ఇయర్ ఫోన్ ద్వారా ప్రతివాదికి సూచిస్తుంది. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన జాషువా బ్రౌడర్ అనే కంప్యూటర్ సైంటిస్టు 2015లో కాలిఫోర్నియాలో డునాట్ పే అనే సంస్థను స్థాపించారు. తాము రూపొంచిన డునాట్ పే యాప్ ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో న్యాయవాది అని ఆయన పేర్కొన్నారు. ఈ రోబో న్యాయవాది పని తీరుకు సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు.

మరోవైపు ఈ యాప్ లోని ఒక బటన్ నొక్కడంతో కార్పొరేషన్ లతో పోరాటం చేయడంతోపాటు బ్యూరోక్రసీని ఓడించవచ్చని ఎవరిపైన అయినా దావా వేయవచ్చని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో జాషువా బ్రౌదర్ పేర్కొన్నారు. చట్టాల్లోని లొసుగులను అసరాగా చేసుకుని నిజాలను తారుమారు చేయడం మంచిది కాదన్నారు. తన యాప్ ద్వారా అలాంటి వాటిని నివారించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.