Killer Robots : నేరస్థులను చంపటానికి ‘రోబో’ పోలీసులు .. ఎక్కడంటే..

నేరస్థులను చంపటానికి శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు రోబో పోలీసులను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం ముసాయిదా ప్రణాళికను రూపొందించారు.

Killer Robots : నేరస్థులను చంపటానికి ‘రోబో’ పోలీసులు .. ఎక్కడంటే..

San Francisco police propose allowing robots to kill in 'rare and exceptional' circumstances

Killer Robots : నేరస్థులను చంపటానికి శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు రోబో పోలీసులను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం ముసాయిదా ప్రణాళికను రూపొందించారు. అమెరికాలో గన్ కల్చర్ సర్వసాధారణంగా మారిపోయిన విషయం తెలిసిందే.అమెకాకలో కాల్పులకు ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.ఎన్నో కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కాల్పులకు పాల్పడేవారితో పాటు తీవ్రమైన ఘటనలకు ప్రయత్నించే నేరగాళ్లను చంపటానికి రోబో పోలీసులను ఉపయోగించాలని యోచిస్తున్నారు. దీనికోసం ఓ ముసాయిదా ప్లాన్ రూపొందించారు. ఈ కొత్త పాలసీ ప్రతిపాదనపై శాన్ ఫ్రాన్సిస్కో బోర్డ్ ఆఫ్ సూపర్‌వైజర్స్ రూల్స్ కమిటీ వచ్చే వారం చర్చించనుంది. ఇప్పటికే.. ముసాయిదా విధానాన్ని పర్యవేక్షకులు ఆరోన్ పెస్కిన్, రాఫెల్ మాండెల్‌మాన్ కమిటీలో సభ్యులుగా ఉన్న కొన్నీ చాన్ పరిశీలించారు.

శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసు విభాగంలో ప్రస్తుతం 17 రోబోలు ఉన్నాయి. అయితే ఇందులో 12 నిర్వహణలో లేవు. మిగతా వాటిని బాంబు తనిఖీలు, నిర్వీర్యానికి ఉపయోగిస్తున్నారు. అయితే తీవ్రమైన నేర ఘటనల్లోనూ వీటిని వినియోగించాలని శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు భావిస్తున్నారు. దీంట్లో భాగంగా కాల్పుల వంటి ఘటనలను తిప్పికొట్టటానికి నేరగాళ్లను చంపేలా రోబోల సామర్థ్యాన్ని పెంచాలని యోచిస్తున్నారు. మెషిన్లు, గ్రనేడ్ లాంఛర్లతో రోబోలను మార్చాలని డ్రాఫ్ట్‌ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. ఈ ముసాయిదా ప్రణాళికపై వచ్చేవారం జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

2016లో డల్లాస్ పోలీసు బలగాలు ప్లాస్టిక్ పేలుడు పదార్థాలను రోబోకు కట్టి, ఐదుగురు అధికారులను చంపిన షూటర్‌ను పేల్చివేయడానికి ఉపయోగించారు. ఇది US చరిత్రలో మొదటిది. కాగా.. ఇప్పటికే పలు దేశాల్లో పోలీసు విభాగాల్లో రోబోలు విధులు నిర్వర్తిస్తున్నారు.