Viral Video : ఆ పిల్లాడికి ఆటిజం.. స్విమ్మింగ్‌ఫూల్‌లో దూకేశాడు.. తండ్రి ఎలా కాపాడాడో చూడండి..!

Little Xavier Rigney : ఆటిజంతో బాధపడుతున్న 4 ఏళ్ల బాలుడిని నీటిలో మునిగిపోకుండా అతడి తండ్రి రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video : ఆ పిల్లాడికి ఆటిజం.. స్విమ్మింగ్‌ఫూల్‌లో దూకేశాడు.. తండ్రి ఎలా కాపాడాడో చూడండి..!

Us Father And Son Save 4 Year Old Boy With Autism From Drowning. Internet Calls Them Heroes (1)

Updated On : May 31, 2022 / 6:40 PM IST

Little Xavier Rigney : ఆటిజంతో బాధపడుతున్న 4 ఏళ్ల బాలుడిని నీటిలో మునిగిపోకుండా అతడి తండ్రి రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లి దగ్గర ఆడుకుంటున్న జేవియర్ రిగ్నీ అనే బాలుడు ఆడుకుంటూ స్విమ్మింగ్ ఫుల్ వద్దకు చేరుకున్నాడు. పిల్లలు అక్కడకి వెళ్లకుండా ఉండేందుకు అడ్డుగా కంచెనుదాటి వెళ్లాడు. బాలుడి సోదరుడు మాడాక్స్ వెస్టర్‌హౌస్ (12) జేవియర్ స్విమ్మింగ్‌లో మునిగిపోవడాన్ని చూసి వెంటనే వెళ్లి తండ్రికి చెప్పాడు. తండ్రి టామ్‌ హుటాహుటినా అక్కడికి పరిగెత్తి ఫూల్ లో దూకేసిన పిల్లాడిన పైకి తీసుకొచ్చాడు.

ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. టామ్ మాడాక్స్ సరైన సమయంలో స్పందించడంతో బాలుడి ప్రాణాలను రక్షించాడు. ఈ వీడియోను తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేయడంతో 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. జేవియర్ స్విమ్మింగ్ ఫూల్‌లో ఎలా మునిగిపోయాడో వీడియోలో చూడవచ్చు. పిల్లాడు ఫూల్‌లో దూకిన సమయంలో పక్కన ఎవరూ లేరు.

అదృష్టవశాత్తూ.. అదే సమయంలో మాడాక్స్, వారి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నుంచి తన తండ్రిని తీసుకురావడానికి పరుగెత్తాడు. టామ్ లాక్ కంచెపై నుంచి దూకి పిల్లవాడ్ని రక్షించాడు. పిల్లాడిని పూల్ నుంచి బయటకు లాగిన వెంటనే తండ్రి CPR అందించాడు. నీళ్లు మింగేసిన పిల్లాడు బయటకు వచ్చేలా చేశాడు. కాసేపటికి పిల్లాడు తేరుకున్నాడు. ఈ వీడియోను చూసిన వారంతా తండ్రిని సూపర్ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో ఇదే..

Read Also : Little Tortoise-Lion : వార్నీ ఎంత ధైర్యం..! సింహం నోట్లో తల పెట్టి బుజ్జి తాబేలు పరాచికాలు..వైరల్ వీడియో