Little Tortoise-Lion : వార్నీ ఎంత ధైర్యం..! సింహం నోట్లో తల పెట్టి బుజ్జి తాబేలు పరాచికాలు..వైరల్ వీడియో

ఓ తాబేలు పిల్ల ఏకంగా సింహంతో పరాచికాలు ఆడింది. సింహాన్ని నీళ్లు తాగనివ్వకుండా ఇది నా చెరువు..నువ్వు ఇక్కడ నీళ్లు తాగటానికి వీల్లేదు అన్నట్లుగా నానా హంగామా చేసింది.

Little Tortoise-Lion : వార్నీ ఎంత ధైర్యం..! సింహం నోట్లో తల పెట్టి బుజ్జి తాబేలు పరాచికాలు..వైరల్ వీడియో

Little Tortoise Lion

LittleTortoise Annoys Lion : ‘సింహం పడుకుంది కదా అని జూలుకు జడ వేయకూడదు.. పక్కనే ఉంది కదా అని పులితో ఫొటో దిగకూడదు’.. ఇవి తెలుగు సినిమాల్లో డైలాగులు. ‘పిట్ట కొంచెం కూత ఘనం’.. ఇది సామెత. నిజాల నుంచి సామెతల పుట్టుకొస్తాయి. అలాగే సినిమాలో కూడా డైలాగులు డ్రెండ్ అయిపోతుంటాయి. అటు సామెతలు..ఇటు సినిమా డైలాగు వాస్తవాల్లోంచి పుట్టుకొచ్చినవే. అలా ఈ రెండింటినీ నిజం చేసేలా ఓ తాబేలు పిల్ల ఏకంగా సింహంతో పరాచికాలు ఆడింది.

ఆ సింహం దాన్ని ఓ చిట్టిదానా నీతో నాకేంటీ అన్నట్లుగా తను వచ్చిన పని చూసుకుంటున్నా ఆ తాబేలు పిల్ల మాత్రం సింహాన్ని వెంటాడి మరీ ఇరిటేట్ చేయటానికి యత్నించింది. కానీ పాపం సింహం మంచితనమో లేదా ‘ ఈ అల్ప జీవితో నాకేంటి’అనుకుందో గానీ ఆ బుజ్జి తాబేలుని పట్టించుకోలేదు. సింహం పట్టించుకోకపోటంతో ఆ బుజ్జి తాబేలు ఈ పేద్ధ సింహాన్ని ఓ ఆటాడేసుకుంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ సింహానికి దాహమేసింది. ఓ నీటికుంటలో నీళ్లు తాగడానికి వచ్చింది. అలా వచ్చిన సింహం నీరు తాగుతుంటే ఆ సింహం వద్దకు ఓ బుజ్జి తాబేలు వచ్చింది. వచ్చింది ఊరుకందా అంటే లేదు. ఏకంగా నోట్లో నోరు పెట్టి గిల్లి కజ్జాలు పెట్టుకుంది. విసుగు తెప్పించేసింది. సర్లే బుజ్జిది కదా.. ఎందుకులే అని ఆ సింహం మరోపక్కకెళ్లి నీళ్లు తాగుతుంటే.. ఆ బుజ్జి తాబేలు అక్కడకూ వెళ్లి సింహాన్ని కెలికేసింది. ఈసారి ఏకంగా సింహం మీసాలను కొరికేందుకు ప్రయత్నించింది. సింహాన్ని నీళ్లు తాగనివ్వకుండా ఇది నా చెరువు..నువ్వు ఇక్కడ నీళ్లు తాగటానికి వీల్లేదు అన్నట్లుగా నానా హంగామా చేసింది.

ఎంత ధైర్యం ఆ బుజ్జి తాబేలుకి. అందుకే అంటారేమో పెద్దలు పిల్ల కాకికేమి తెలుసు ఉండేలు దెబ్బ అని. చూశారా. ఇది కూడా సామెతే. తాబేలు పిల్ల సింహాన్ని ఎంతగా అల్లరి చేసినా అడవికి రారాజైన సింహం మాత్రం ఏమీ అనలేదు. అక్కడి నుంచి లేచి వేరే చోటకు వెళ్లబోయింది. అంతే.. అది ఎటుపోతే అటు ఆ బుజ్జి తాబేలూ వెళ్లింది. ఎక్కడ జరిగిందో ఏమోగానీ.. ఆ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయిపోయింది. ‘గెట్ ఆఫ్ మై పాండ్ (ఇది నా చెరువు.. వెళ్లిపో)’ అనే ట్యాగ్ తో ఫైనెస్ట్ ఆఫ్ వరల్డ్ అనే ఇన్ స్టా అకౌంట్ లో ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో పాతదే అయినా మరోసారి వైరల్ గా మారింది.