US President Joe Biden : జో బిడెన్ ఇంటి సమీపంలోని నిషేధిత గగనతలంలోకి వచ్చిన పౌరవిమానం…యూఎస్ సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇంటి సమీపంలోకి ఓ పౌర విమానం వచ్చిన ఘటన అమెరికా దేశంలో కలకలం రేపింది. డెలావేర్‌లో ఒక పౌర విమానం జో బిడెన్ నివాస ప్రాంతానికి సమీపంలోని నిషేధిత గగనతలంలోకి ప్రవేశించింది....

US President Joe Biden : జో బిడెన్ ఇంటి సమీపంలోని నిషేధిత గగనతలంలోకి వచ్చిన పౌరవిమానం…యూఎస్ సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు

Biden's Delaware Home

Updated On : October 29, 2023 / 6:44 AM IST

US President Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇంటి సమీపంలోకి ఓ పౌర విమానం వచ్చిన ఘటన అమెరికా దేశంలో కలకలం రేపింది. డెలావేర్‌లో ఒక పౌర విమానం జో బిడెన్ నివాస ప్రాంతానికి సమీపంలోని నిషేధిత గగనతలంలోకి ప్రవేశించింది. నిబంధనలు ఉల్లంఘించి విమానం నిషేధిత గగనతలంలోకి ప్రవేశించడంతో యూఎస్ ఫైటర్ జెట్‌లు దాడి చేశాయి.

Also Read : Mike Pence :అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ సంచలన నిర్ణయం

పౌర విమానం నిషేధిత గగనతలంలోకి ప్రవేశించిన సమయంలో యూఎస్ అధ్యక్షుడు జో బిడెన్ విల్మింగ్టన్‌లోని అతని ఇంట్లో ఉన్నారని యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ కమ్యూనికేషన్స్ చీఫ్ ఆంథోనీ గుగ్లీల్మీని చెప్పారు. పౌర విమానం విల్మింగ్టన్‌కు ఉత్తరాన నిషేధిత గగనతలంలోకి ప్రవేశించింది. దీంతో ముందుజాగ్రత్తగా ఫైటర్ జెట్‌లతో దాడి చేశామని ఆంథోని పేర్కొన్నారు.

Also Read : Mexico : మెక్సికోలో అకాపుల్కో హరికేన్ విధ్వంసం…39 మంది మృతి

దీంతో సమీపంలోని విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని ఆయన వివరించారు. ఈ విమానం రాక వల్ల అమెరికా అధ్యక్షుడి కదలికలపై ఎలాంటి ప్రభావం పడలేదన్నారు. అమెరికా దేశానికి చెందిన సీక్రెట్ సర్వీస్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన ఏజెంట్లు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.