Women Eat Walls : ఇంటి గోడల్ని తినేస్తున్న మహిళ..పక్కింటి గోడల్ని కూడా వదలటంలేదు..

ఓ మహిళ ఇంటి గోడల్ని చాక్లెట్లలా తినేస్తోంది. గత ఐదు ఏళ్లుగా గోడల్ని తినేస్తోంది. ఒకోరకంగా గోడ ఒక్కో టేస్టు ఉంటుంది..ఆ టేస్టు భలే ఉంటోెందని చెబుతోంది.

Women Eat Walls : ఇంటి గోడల్ని తినేస్తున్న మహిళ..పక్కింటి గోడల్ని కూడా వదలటంలేదు..

Womenn Eat Walls

Updated On : October 28, 2021 / 4:52 PM IST

Women Eat Walls: కొన్ని వింత అలవాట్లు గురించి తెలిస్తే షాక్ అవుతాం. కొంతమంది మన్ను తింటుంటారు. మరికొందరు చాక్ పీసులు, ఇంకొందరు ట్యూబ్ లైట్లను తింటున్నారనీ..ఇంకా ఆశ్యర్యంగా వెంట్రుకలు తిన్న మహిళ గురించి కూడా తెలుసు. మరో మహిళ తన భర్త చితా భస్మాన్ని ఏకంగా చాక్లెట్ లాగా తినేస్తోందని విన్నాం. కానీ అమెరికాలోని మిచిగాన్‌ కు చెందిన ఓ మహిళ వింత అలవాటు గురించి తెలిస్తే షాక్ అయిపోవటమే కాదు ఓరి నాయనో ఆ ఇల్లు కూలిపోతుందా ఏంటీ..అని తప్పకుండా అనుకుంటాం. ఎందుకంటే నికోల్ అనే మహిళ ఏకంగా ‘‘ఇంటి గోడలను’’ తినేస్తోంది..!! ఓ టీవీ ప్రోగ్రామ్ లో నికోల్ ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పి అందరికి ఆశ్చర్యపరిచింది.

నికోల్ గత ఐదేళ్లుగా ఇలా వింతగా ప్రవర్తిస్తోందట. ఇంట్లోని గోడలని తినేస్తోంది. తన వింత అలవాటు గురించి నికోల్ మాట్లాడుతు..‘‘ నాకు పొడి గోడ సువాసన అంటే చాలా ఇష్టం. ఆ వాసనకు తినేయాలనిపిస్తుంది. కంట్రోల్ చేసుకోలేను. అందుకే అలా గోడల్ని తినాలనిపించి తింటుంటాను’ అని చెప్పింది. అలా తన వింత అలవాటుతో నికోల్ ఒక వారంలో మూడు చదరపు అడుగుల గోడని తినేసింది.

Read more :SHOCKING News : భర్త చితాభస్మాన్ని తింటున్న మహిళ..కంపుకొడుతున్నా మాననంటోంది.. 

పైగా ఆమెకు ఓ పాప కూడా ఉంది. పాప పుట్టకముందు నుంచి నికోల్ కు ఈ వింత అలవాటు ఉంది. బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా నికోల్ తన అలవాటుని మానుకోలేకపోతోంది. గోడల్ని తినకుండా ఉండలేకపోతోందట. పాపం నికోల్ వింత ప్రవర్తన ఎంత వరకు వెళ్లిందంటే..ఆమె తన ఇంట్లోనే కాకుండా ఎవరింటికన్నా వెళితే వారి ఇంటి గోడల్ని కూడా తినేంత పీక్ స్టేజ్ లోకి వెళ్లిపోయింది ఆమె అలవాటు. దీంతో ఆమె బంధువులు నికోల్ వింత అలవాటు మాకేమీ అర్థం కావట్లేదని వాపోతున్నారు.

పాపం నికోల్ కు ఇటువంటి వింత అలవాటు కావడానికి ఓ బలమైన కారణం ఉంది. అది ఆమె తల్లి మరణం. తల్లి చనిపోవటంతో నికోల్ డిప్రెషన్ కి గురైంది. ఎక్కడంటే అక్కడే గోడలకు జారబడి నిస్త్రాణంగా గంటల తరపబడి కూర్చుండిపోయేది. ఆ ఆ డిప్రెషన్‌ తో ఆమో గోడల్ని గీకటంవాటిని తినడం మొదలుపెట్టింది. అలా అలా అదికాస్తా అలవాటుగా రాను రాను అది వ్యసనంగా మారిపోయింది. కానీ ఆ అలవాటు మానుకోవాలని నికోల్ చాలా ప్రయత్నించింది. కానీ కంట్రోల్ చేసుకోలేకపోయేది.

Read more : ఆమెకు జుట్టు పీక్కు తినే అలవాటు..కడుపులో రెండున్నర కిలోల వెంట్రుకలు..

ఈ అలవాటు మానుకోవాలని ఎంతగానో ఉండేది. ఇప్పటికి ఉంది. కానీ గోడలను తినకుండా ఉండలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది నికోల్. ఆమెకున్న ఆ అలవాటు పలు రకాలుగా మారటం ఆందోళన కలిగిస్తోంది. అది ఆమె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తోంది. అలా నికోల్ రకరకాల గోడలను తినటానికి ఇష్టపడుతోంది. మందపాటి, సన్నని గోడల రుచి చాలా వెరైటీగా ఉంటుందనీ..రకరకాల గోడల ఆకృతిని, రుచిని ఎక్కువగా ఇష్టపడుతానని చెబుతోంది. అవి తిన్నప్పుడు ఒక తెలియని అనుభూతి కలుగుతుందని నికోల్ చెబుతోంది.

నికోల్‌ కున్న ఈ వింత అలవాటు గురించి డాక్టర్లు ఈ అలవాటు ఆమె ఆరోగ్యానికి హానీ కలిగిస్తుందని..గోడలకు వేసే పెయింట్ లో హానికరమైన రసాయనాలు ఉంటాయని, వాటి వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆ రసాయనాలు కడుపులోకి వెళితే..పేగుల్లో సమస్యలు వస్తాయంటున్నారు. కానీ పాపం నికోల్ మాత్రం తన అలవాటుని మానుకోలేకపోతున్నానని చెబుతోంది.ఈ వ్యవసాన్ని వదిలించుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ వదలలేకపోతున్నానని నికోల్ చెబుతోంది.