ఆమెకు జుట్టు పీక్కు తినే అలవాటు..కడుపులో రెండున్నర కిలోల వెంట్రుకలు..

ఆమెకు జుట్టు పీక్కు తినే అలవాటు..కడుపులో రెండున్నర కిలోల వెంట్రుకలు..

Telangana Nirmal Women 2.5 kg hair In stomach : కొంతమందికి మట్టి తినే అలవాటుఉంటుంది. మరికొందరికి సుద్ద, బియ్యం తినే అలవాటు ఉంటుంది. కానీ తెలంగాణాలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ లోని ఓ మహిళకు ఏకంగా వెంట్రుకలు తినే అలవాటు ఉంది. తన నెత్తిమీద వెంట్రుల్ని పీక్కుని మరీ తినేస్తుంది. దీంతో ఆమెకు కడుపులో ఏకంగా వెంట్రులకు పేరుకుపోయాయి. ఉండలా ఓ చోట పేరుకుపోయాయి.

దీంతో ఆ మహిళకు కడుపులో విపరీతమైన నొప్పి రావటంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను హాస్పిటల్ కు తీసుకొచ్చారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు స్కానింగ్ చేయగా..కడుపులో భారీగా పేరుకుపోయిన వెంట్రుకల పోగు కనిపించింది. దీంతో ఆశ్చర్యపోయిన డాక్టర్లు ఆ మహిళ గురించి విచారించగా..ఆమెకు మతిస్థితిమితం ఉండదని కుటుంబ సభ్యులు తెలిపారు.

వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పటంతో దానికి వాళ్లు అంగీకరించారు. దీంతో ఆమెకు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న వెంట్రుల్ని బైటకు తీసారు. ఆ వెంట్రుకల పోగు ఏకంగా రెండున్నర కిలోలు ఉన్నాయని డాక్టర్లుతెలిపారు.

ఆపరేషన్ విజయవంతం కావడంతో రోగి బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. కాగా దీనిపై సదరు బాధితురాలి బంధువులు మాట్లాడుతూ..ఆమెకు మతిస్థితిమితం సరిగా ఉండదనీ..జుట్టు పీక్కుంటు ఉంటుందని కానీ ఆ జుట్టుని తినేస్తుందని తమకు తెలియలేదని..కడుపునొప్పితో ఆమె బాధపడుతుంటే హాస్పిటల్ కు తీసుకురాగా డాక్టర్లు ఆమె కడుపులో వెంట్రుకలు పేరుకుపోయాయని చెప్పటంతో ఆశ్చర్యపోయామని తెలిపారు.