సెప్టెంబర్ 1 నుంచి తొలగింపు : ఇండియాలో అమెరికా వీసాలకు ఇంటర్వ్యూ అక్కర్లేదు!

  • Published By: sreehari ,Published On : August 29, 2019 / 10:21 AM IST
సెప్టెంబర్ 1 నుంచి తొలగింపు : ఇండియాలో అమెరికా వీసాలకు ఇంటర్వ్యూ అక్కర్లేదు!

Updated On : August 29, 2019 / 10:21 AM IST

భారతీయ పౌరుల కోసం వీసా దరఖాస్తు ప్రక్రియను అమెరికా సులభతరం చేస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి ఇండియాలో కొన్ని అమెరికా వీసాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు లభించనుంది. ఈ మేరకు అమెరికా కాన్సులేట్ ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్‌తో ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా వీసా అభ్యర్థులపై కస్టమర్ సర్వీసును మెరుగుపర్చడమే కాకుండా వీసా పునరుద్ధరణ చేసే సమయాన్ని కూడా తగ్గించాలని భావిస్తున్నట్టు తెలిపింది. 

సెప్టెంబర్ 1 నుంచి అమెరికా వీసాకు అర్హత కలిగిన అభ్యర్థులు దేశంలో 11 ప్రదేశాల్లో ఏదైనా ఒక ప్రాంతంలో తమ వీసా దరఖాస్తు మెటేరియల్స్, పాస్ పోర్టును ఉంచేందుకు అపాయింట్ మెంట్ డేట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని కాన్సులేట్ పేర్కొంది. ఆ తర్వాత యూఎస్ రాయబారి కార్యాలయానికి  లేదా కాన్సులేట్ వీసా దరఖాస్తును పంపే ముందు వీసా దరఖాస్తులో పత్రాలను కేంద్ర ఉద్యోగులు పరిశీలిస్తారు. 

వీసా దరఖాస్తుదారులు తమ దరఖాస్తు పంపిన 7 రోజులు నుంచి 10 పనిదినాల్లో నిర్ణయాన్ని తెలపవచ్చునని రిపోర్టు తెలిపింది. అమెరికా వీసా పునరుద్ధరించాలనుకునే 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 79 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు వచ్చే నెల నుంచి యూఎస్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో తప్పనిసరి ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు పొందేందుకు అర్హత సాధించవచ్చునని నివేదిక తెలిపింది. కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూకు దరఖాస్తుదారుడు హాజరు కావాలని కాన్సులేట్ స్పష్టం చేసింది. ‘ఒకవేళ దరఖాస్తుదారుడు అవసరమైతే ఇంటర్వ్యూకు రావాల్సి ఉంటుంది. 

అతడు లేదా ఆమె ఇంటర్వ్యూ మినహాయింపు ప్రాసెసింగ్ కోసం ఎంపిక చేసిన పోస్టులో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి పత్రాలు సమర్పించాక ఒక పోస్టు నుంచి మరో పోస్టుకు బదిలీ చేయడం సాధ్యం కాదు. ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిన దరఖాస్తుదారులు ఎలా ముందుకు కొనసాగాలి అనేది తెలియజేయడం జరుగుతుందని కాన్సులేట్ తెలిపింది. యూఎస్ వీసా దరఖాస్తు కేంద్రాలు.. ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, చండీగఢ్, పుణె, హైదరాబాద్, జలంధర్, కొచ్చి, ముంబై ప్రాంతాల్లో ఉన్నాయి.