2020 టిప్ ఛాలెంజ్.. సర్వర్లకు పండగే:రూ.19వేల బిల్‌కు..రూ.1 లక్షా 47 వేలు టిప్!

2020 టిప్ ఛాలెంజ్.. సర్వర్లకు పండగే:రూ.19వేల బిల్‌కు..రూ.1 లక్షా 47 వేలు టిప్!

Updated On : January 4, 2021 / 12:00 PM IST

us  server gets dollars 2020 tip on dollars 270 : ఈ పక్క కరోనా కష్టాలు మరో పక్క..2020కు గుడ్ బై చెబుతూ..2021 కు వెల్కమ్ చెబుతున్న శుభ సందర్భంగా హోటళ్లు, రెస్టారెంట్ల సర్వర్ల ముఖాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఎందుకంటే..కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా 2020 ఛాలెంజ్ హోటళ్లు, రెస్టారెంట్లకు పండుగే అయ్యింది. ‘2020 టిప్ చాలెంజ్‌లో పాల్గొంటున్న ఎంతోమంది సర్వర్లకు 20.20 లేదంటే 2020 డాలర్లు టిప్‌గా ఇస్తూ దయాగుణాన్ని చాటుకుంటున్నారు కొంతమంది.

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడ్డాయి. వేలాదిమంది సర్వర్లు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. దిక్కుతోచక కరోనా కష్టాల్లో కొట్టుమిట్టాడారు. కరోనా పరిస్థితులు కొంతలో కొంత అనుకూలించడంతో హోటళ్లు, రెస్టారెంట్లు తిరిగి తెరుచుకున్నాయి.

కరోనా కారణంగా అతలాకుతలమైన జీవితాల నుంచి మాత్రం ప్రజలు ఇంకా పూర్తిగా బయటపడలేకపోతున్నారు. కానీ గుడ్డికంటే మెల్ల మెరుగు అన్నట్లుగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. హోటళ్లు, రెస్టాంరెట్లలో పనిచేసే సర్వర్ల పరిస్థితి మరింత దారుణంగా మారిందనే చెప్పాలి. ఈ క్రమంలో కొందరు దయార్థ్ర హృదయులు సామాజిక మాధ్యమాల్లో ‘2020 టిప్ చాలెంజ్’ విసురుతున్నారు. ఈ ఛాలెంజ్ పలువురి సర్వర్ల ముఖాల్లో వెలుగులు నింపుతోంది. ఈ చాలెంజ్‌లో పాల్గొంటున్న పలువురు సర్వర్లకు 2020 డాలర్లు టిప్‌గా ఇస్తూ దయాగుణాన్ని చాటుకుంటున్నారు.

ఈ క్రమంలో అమెరికాలోని ఓ రెస్టారెంట్ సర్వర్‌కు ఓ కష్టమర్ 2020 డాలర్లు టిప్‌గా ఇచ్చాడు. దానికి సంబంధించిన బిల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫ్లోరిడాలోని భారతీయ రెస్టారెంట్ ‘మసాలా మంత్ర ఇండియన్ బిస్ట్రో’లో ఓ వ్యక్తి 270 డాలర్ల బిల్‌కు ( ఇండియా కరెన్సీలో రూ. 19వేలకు పైగా గాను.. తనకు వడ్డించిన సర్వర్‌కు బిల్ కు అదనంగా 2020 డాలర్లు (ఇండియాకరెన్సీలో రూ.1 లక్షా 47 వేలకు పైనే)టిప్‌గా ఇచ్చి కూల్ గా వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఆ రెస్టారెంట్ ఫేస్‌బుక్ లో షేర్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది.

ఈ సందర్బంగా ఈ రెస్టారెంట్ యాజమాన్యం ఫేస్ బుక్ లో సదరు కష్టమర్ కు ధన్యవాదాలు తెలుపుతూ..‘‘తమ సర్వర్ డాన్‌కు 2020 డాలర్ల టిప్ ఇచ్చి ఆ వ్యక్తి పెద్ద మనసు చాటుకున్నారు..ఇది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కష్టమర్లను ఆ దేవుడు చల్లాగా చూస్తాడని ఆకాంక్షించింది.

మా రెస్టారెంటే కాదు ఈ కరోనా కాలపు కోరల్లో చిక్కుకున్ని ప్రతీ సంస్థలకు ఇది చాలా కష్టకాలం..ఈ ఏడాది ప్రతీ రెస్టారెంటుకు గడ్డుకాలమే. కానీ ఈ కష్టంలో తామున్నామంటూ పెద్ద మనస్సు చాటుకునే ఇటువంటి దయార్ధ్ర హృదయులు మాకు చేదోడు వాదోడుగా ఉన్నారని అటువంటివారందరికీ మేం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కష్టకాలంలో వారు మా సర్వర్ల జీవితాల్లో ఆనందాలు నింపారు’’ అని పేర్కొంటూ బిల్లును షేర్ చేసింది. కానీ..పెద్ద మనస్సుకు ప్రత్యేకించి పేర్లు అవసరం లేదు…ప్రార్థించే పెదవులకంటే సహాయం చేసే చేతులు మిన్న అనే మధర్ థెరిస్సా చెప్పినట్లుగా టిప్ ఇచ్చిన వ్యక్తి పేరును మాత్రం వెల్లడించలేదు సదరు రెస్టారెంట్. ఈ పోస్టు అనంతరం అంత పెద్ద టిప్ ఇచ్చిన వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.