USA: బాలుడు చనిపోయాడని నిర్ధారించిన వైద్యులు.. అతడు కదిలిన దృశ్యాన్ని చూసి వైద్యులకు చెప్పిన తండ్రి.. ఆ తర్వాత..

USA: ఈ తర్వాత జరిగిన అద్భుతంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీనిపై వైద్యులు స్పందించారు.

USA: బాలుడు చనిపోయాడని నిర్ధారించిన వైద్యులు.. అతడు కదిలిన దృశ్యాన్ని చూసి వైద్యులకు చెప్పిన తండ్రి.. ఆ తర్వాత..

USA

Updated On : April 21, 2023 / 12:07 PM IST

USA: సామీ బెర్కో అనే ఓ బాలుడు (16) జిమ్ కు సమీపంలో రాక్ క్లైంబింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో కార్డియాక్ అరెస్ట్ తో విలవిలలాడిపోయాడు. అనంతరం స్పృహకోల్పోయాడు. అతడికి వైద్యులు, ఇతర సిబ్బంది సీపీఆర్ చేశారు. దాదాపు రెండు గంటల పాటు వైద్యులు శ్రమించినా లాభం లేకుండా పోయింది. ఆ బాలుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.

ఈ విషయాన్ని ఆసుపత్రి వద్ద ఉన్న ఆ బాలుడి కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే, ఆ సమయంలో సామీ బెర్కో తండ్రి ఓ విషయాన్ని గుర్తించారు. సామీ బెర్కో శరీర భాగాలు కదులుతున్నాయని చెప్పారు. దీంతో వైద్యులు వెళ్లి మళ్లీ ఆ బాలుడిని చూశారు. చనిపోయాడని నిర్ధారణకు వచ్చిన ఆ బాలుడు మళ్లీ కదులుతుండడం వైద్యులనూ ఆశ్చర్యానికి గురిచేసింది.

తన కుమారుడి గుండె మళ్లీ కొట్టుకుంటోందని తెలుసుకుని తమ ఆనందానికి అవుధులు లేకుండాపోయాయని సామీ బెర్కో తల్లి జెన్నిఫర్ బెర్కో తెలిపారు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదని చెప్పారు. ఇది వైద్య చరిత్రలోనే అద్భుతం అంటూ వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. అనంతరం ఆ బాలుడికి వైద్యులు చికిత్స అందించారు.

అమెరికాలోని టెక్సాస్, మిస్సోరీ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జన్యు పరంగాసామీ బెర్కోకు హృదయ సంబంధింత సమస్యలు వచ్చాయి. జెన్నిఫర్ బెర్కో చిన్న కుమారుడు ఫ్రాంకీ కూడా 2020లో కాటెకోలమినెర్జిక్ పాలిమార్ఫిక్ వెంట్రిక్యూలర్ టాచీకార్డియా సమస్య వల్ల కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యాడు. అతడి తండ్రి సీపీఆర్ చేసినప్పటికీ ప్రాణాలు కోల్పోయాడు.

Delhi Saket Court : ఢిల్లీ సాకేత్ కోర్టులో కాల్పుల కలకలం.. లాయర్ వేషాధారణలో వెళ్లి ఫైరింగ్