Delhi Saket Court : ఢిల్లీ సాకేత్ కోర్టులో కాల్పుల కలకలం.. లాయర్ వేషాధారణలో వెళ్లి ఫైరింగ్
ఈ కాల్పుల్లో అక్కడే ఉన్న స్థానిక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆమెను వెంటనే ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Delhi Saket Court
Delhi Saket Court : ఢిల్లీ సాకేత్ కోర్టులో కాల్పుల కలకలం రేగింది. సాకేత్ కోర్టు ఆవరణంలో దండగుడు కాల్పులకు తెగబడ్డారు. లాయర్స్ బ్లాక్ లో దుండగుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లాయర్ వేషాధారణంలో వచ్చిన ఓ అగంతకుడు లాయర్స్ బ్లాక్ లోకి దూసుకెళ్లి కాల్పులకు పాల్పడ్డాడు. అగంతకుడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో అక్కడే ఉన్న స్థానిక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆమెను వెంటనే ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే కోర్టు ప్రారంభమయ్యే సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా కాల్పుల మోతతో లాయర్లతోపాటు కోర్టుకు వచ్చిన వారంతా భయాందోళనకు గురై బయటికి పరుగులు తీశారు. పోలీసుల సమక్షంలోనే ఈ కాల్పులు జరగడం గమనార్హం.
Uttar Pradesh: జిల్లా కోర్టులో కాల్పులు.. అండర్ ట్రయల్ ఖైదీ మృతి
అయితే కాల్పులు జరిపిన వ్యక్తి అనుమానిత లాయర్ గా తెలుస్తోంది. ఇంకా పూర్తిస్థాయి వివరాలు తెలియాల్సివుంది. ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. కోర్టు ప్రాంగణం మొత్తాన్ని సీల్ చేశారు. ఎవరిని కూడా కోర్టు హాల్ లోకి అనుమతించడం లేదు. గాయపడిన మహిళ ఆరోగ్యంపై సాకేత్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏ కోణంలో ఈ ఘటన జరిగిందన్న దానిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. లాయర్ వేషాధారణలో కోర్టు కాంప్లెక్స్ లోకి ఆయుధాన్ని ఎలా తీసుకొచ్చారని అనుమానిస్తున్నారు. అయితే ఇక్కడ సెక్యూరిటీ లోపం ప్రధానంగా కనిపిస్తోంది. గతంలో ఢిల్లీ జిల్లా కోర్టుల్లో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.
Delhi Court : కోర్టులో గ్యాంగ్‌స్టర్‌ల మధ్య కాల్పులు, జితేందర్ గోగి హతం
రోహిణి కోర్టులోగానీ, సాకేత్ కోర్టులో గానీ గతంలో ఇటువంటి ఫైరింగ్ ఘటనలో జరిగాయి. ఆ తర్వాత కోర్టుల వద్ద భద్రతను పెంచాలని సుప్రీంకోర్టుల సీజేఐ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా తరచు ఇలాంటి ఘటనలు కోర్టు ప్రాంగణంలోనే చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం తాజాగా జరిగిన ఘటనకు గల కారణాలేంటి అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.