Delhi Court : కోర్టులో గ్యాంగ్‌‌స్టర్‌‌ల మధ్య కాల్పులు, జితేందర్ గోగి హతం

దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ గ్యాంగ్ స్టర్ ను ప్రత్యర్థులు అందరూ చూస్తుండగానే కాల్పి చంపేశారు.

Delhi Court : కోర్టులో గ్యాంగ్‌‌స్టర్‌‌ల మధ్య కాల్పులు, జితేందర్ గోగి హతం

Rohini

Updated On : September 24, 2021 / 3:05 PM IST

Gangster Jitendra Gogi : దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ గ్యాంగ్ స్టర్ ను ప్రత్యర్థులు అందరూ చూస్తుండగానే కాల్పి చంపేశారు. కోర్టుకు వస్తారని పక్కా సమాచారం అందుకున్న ప్రత్యర్థులు..పోలీసుల కళ్లు గప్పి..లాయర్ల దుస్తుల వేషంలో కోర్టుకు చేరుకున్నారు. అనంతరం తమ ప్రత్యర్థుల కోసం వేచి చూశారు. వారు రాగానే..దుస్తుల్లో ఉంచుకున్న తుపాకులను తీసి వారిపైకి కాల్పులు జరిపారు. దీంతో ఆ ఆవరణ మొత్తం రక్తసిక్తమైంది. ఈ ఘటనలో గ్యాంగ్ స్టర్ జితేందర్ గోగితో సహా…నలుగురు మృతి చెందారు.

Read More : JC Diwakar Reddy : ఏపీలో కంటే తెలంగాణలో పాలన భేష్, ఇక్కడే ఉంటే బాగుండేది – జేసీ

2021, సెప్టెంబర్ 24వ తేదీ శుక్రవారం ఉదయం ఢిల్లీలోని రోహిణి కోర్టుకు గ్యాంగ్ స్టర్ జితేందర్ గోగి తన లాయర్, అనుచరులతో వచ్చారు. ఈ సమాచారం ప్రత్యర్థులకు తెలిసింది. దీంతో కోర్టు వద్దకు చేరుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు లాయర్ల దుస్తుల్లో వచ్చారు. రూమ్ నెంబర్ 207లో జితేందర్ గోగి ఉన్నాడని తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లి..విచక్షణారహితంగా ఫైరింగ్ చేశారు.

Read More : Amarinder Singh: కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. బీజేపీలోకి మాజీ సీఎం అమరీందర్ సింగ్!

వెంటనే తేరుకున్న గోగి అనుచరులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో జితేందర్ గోగితో సహా..నలుగురు కుప్పకూలిపోయారు. గ్యాంగ్ స్టర్ జితేందర్ తరపు లాయర్ కు కూడా గాయాలయ్యాయి. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. అసలు కోర్టు ఆవరణలోకి ఆయుధాలతో ఎలా వచ్చారనేది తెలియడం రాలేదు. కాల్పుల ఘటనతో అక్కడున్న వారు పరుగులు తీశారు. తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతేదహాలను తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.