Afghanistan: కాబూల్ ఎయిర్‌పోర్టులో గాల్లోకి అమెరికా బ‌ల‌గాల కాల్పులు

కాబుల్ ఎయిర్ పోర్టు వద్ద జనంతో రద్దీగా మారింది. జనాన్ని అదుపుచేయడం ఇబ్బందిగా మారడంతో అక్కడి అమెరికా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి.

Us Troops Fire Shots In Air At Kabul Airport As Crowd Mobs Tarmac

Afghanistan People : అఫ్ఘానిస్థాన్‌ మ‌రోసారి తాలిబ‌న్ల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఒకప్పటి తాలిబన్ల క్రూరపాలన మళ్లీ వచ్చిందంటూ అక్కడి జనమంతా భయంతో వణికిపోతున్నారు. ప్రాణాలను అరచేతుల్లో పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో కాబూల్ ఎయిర్ పోర్టుకు భారీ సంఖ్యలో జనం తరలివస్తున్నారు. అఫ్ఘాన్ నుంచి బయటపడేందుకు సరిహద్దులకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో కాబుల్ ఎయిర్ పోర్టు వద్ద జనంతో రద్దీగా మారింది. జనాన్ని అదుపుచేయడం ఇబ్బందిగా మారడంతో అక్కడి అమెరికా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. దాంతో ఒక్కసారిగా అప్ఘాన్ ప్ర‌జ‌ల్లో తీవ్ర భ‌యాందోళ‌న‌ నెలకొంది. సాధ్యమైనంత తొందరగా ఏదో విమానం ఎక్కేసి దేశం దాటేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాల్పుల తీరును చూస్తే భయానకంగా ఉందని అక్కడి జనమంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Afghan People Fear : తాలిబన్ల అప్పటి క్రూర పాలన.. వణికిపోతున్న అఫ్ఘాన్ ప్రజలు!

అప్ఘాన్ రాజధాని కాబూల్ ను తాలిబన్లు సమీపించారని తెలియగానే అఫ్ఘాన్ల గుండెల్లో వణకుపుట్టింది. ఎక్కడికి పారిపోవాలో తెలియక వణికిపోతున్నారు. కుర్రాళ్లంతా కంగారుగా ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. వేసుకున్న టీ షర్ట్‌, జీన్స్‌లను తీసిపారేశారు. సంప్రదాయ దుస్తులను ధరిస్తున్నారు. కాబూల్‌ యూనివర్శిటీ విద్యార్థినులు తుది వీడ్కోలు చెప్పేశారు. యూనివర్శిటీకి వచ్చే పరిస్థితి లేదని కన్నీంటిపర్యంతమయ్యారు. మహిళలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్న పరిస్థితి. ఇప్పటికే తాలిబన్ల ఆక్రమణతో వివిధ దేశాల రాయబార కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఏ దేశానికైనా వెళ్లి ఆశ్రయం పొందే అవకాశం లేక అక్కడి ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మరోవైపు.. కాబూల్‌లో తాలిబన్లు శాంతిమంత్రం పఠిస్తున్నారు. ప్రభుత్వమే అధికారాన్ని తమకు అప్పగించాలని తాలిబన్లు షరతు విధించారు. ఘనీ రాజీనామాతో సాధారణ ప్రజలకు హాని తలపెట్టబోమని ప్రకటించారు. శాంతియుత చర్చల ద్వారానే కాబూల్‌ను తాలిబన్లు హస్తగతం చేశారు. విదేశీయులు అఫ్ఘాన్‌లో ఉండాలనుకుంటే ఉండొచ్చన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సేందనని స్పష్టం చేశారు. అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితులను గమనిస్తున్న భారత్.. మనవాళ్లను తీసుకొచ్చేందుకు కాబూల్‌కు ఎయిరిండియా విమానాలను పంపింది. పలు దేశాల ప్రయాణీకులతో కాబూల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ రద్దీగా మారింది.
Taliban : అఫ్ఘాన్‌లో మళ్లీ తాలిబన్ల రాజ్యం!