West Virginia Offer : టీకా వేయించుకునేవారికి అమెరికా బంపరాఫర్

అమెరికాలోని వెస్ట్ వర్జీనియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వచ్చే యువతకు 100 డాలర్ల విలువైన సేవింగ్స్ బాండ్‌ను ఇవ్వనున్నట్టు వెల్లడించింది.

West Virginia Offer : టీకా వేయించుకునేవారికి అమెరికా బంపరాఫర్

West Virginia Offer

Updated On : April 28, 2021 / 7:18 AM IST

Virginia Vaccination Offer : అమెరికాలోని వెస్ట్ వర్జీనియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వచ్చే యువతకు 100 డాలర్ల విలువైన సేవింగ్స్ బాండ్‌ను ఇవ్వనున్నట్టు వెల్లడించింది. 16 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న యువకుల్లో వ్యాక్సిన్ పై అవగాహన కల్పించేలా ఈ కొత్త ఆఫర్ ప్రకటించింది. యువతను వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహించేందుకు ఆఫర్ ప్రకటించినట్టు వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం పేర్కొంది.

వ్యాక్సిన్ వేయించుకోవడం ఎంత అవసరమో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. వ్యాక్సిన్ అవసరాన్ని యువకులు తెలుసుకోలేకపోతున్నారని రాష్ట్ర గవర్నర్ జిమ్ జస్టిస్ అన్నారు.

అత్యధికంగా వ్యాక్సిన్లు వేస్తున్న అమెరికాలోని టాప్ స్టేట్స్‌లో ఒకటిగా వర్జీనియా వెనుకబడింది. దాంతో ఎలాగైనా యువతలో టీకాపై అవగాహన కల్పించి ఎక్కువ మంది వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని వర్జీనియా ఆఫర్ ప్రకటించింది.