Donald Trump: ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ.. బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి ట్రంప్‌ నుంచి భారీ షాక్.. ఇప్పుడెలా?

షేక్‌ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్ ఆ దేశాన్ని పాలిస్తున్న విషయం తెలిసిందే.

Donald Trump: ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ.. బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి ట్రంప్‌ నుంచి భారీ షాక్.. ఇప్పుడెలా?

Yunus, Donald Trump

Updated On : January 26, 2025 / 8:51 PM IST

ఇప్పటికే బంగ్లాదేశ్‌ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. షేక్‌ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్ ఆ దేశాన్ని పాలిస్తున్న విషయం తెలిసిందే. ఆర్థికంగా చితికిపోతున్న బంగ్లాదేశ్‌కు ఇకపై అమెరికా నుంచి కూడా సాయం అందకుండా పోతుంది.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విదేశాలకు సాయంపై విడుదల చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఏఐడీ) బంగ్లాదేశ్‌కు సాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది.

నిధుల సస్పెన్షన్‌తో బిలియన్ డాలర్లు అందకుండా పోతాయి. ఇన్నాళ్లు యూఎస్‌ బంగ్లాదేశ్‌లో ఆరోగ్యం, విద్య, ఆహార భద్రత, మానవతా కార్యక్రమాలకు ఈ నిధులు విడుదల చేస్తూ వచ్చింది.

యూఎస్‌ఏఐడీ శనివారం విడుదల చేసిన ఓ లేఖలో తమ అధికారులకు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అన్ని కాంట్రాక్టులు, గ్రాంట్లు, సహాయ కార్యక్రమాలను తక్షణమే నిలిపివేయాలని అందులో పేర్కొంది.

ట్రంప్‌ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో పనిచేస్తున్న వారికి షాక్ ఇచ్చింది. అలాగే, యూఎస్ నిధులతో యూనస్‌ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఎన్జీవోలు కూడా యూఎస్‌ఏఐడీ ఆదేశాలతో షాక్ అయ్యారు. ఇజ్రాయెల్ మినహా ఉక్రెయిన్‌ సహా అన్ని దేశాలకు చేస్తున్న సాయాన్ని స్తంభింపజేయాలని ట్రంప్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది.

Revanth Reddy: రేషన్‌ కార్డులు ఉన్న పేదలకు త్వరలోనే ఇవి కూడా ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి