Covid Vaccine : వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలి ?..తెలుసుకోవాల్సిన విషయాలు

వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినా...తీవ్రత అంత ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో..అసలు టీకాలు ఎందుకు తీసుకోవాలి ? ఎంత ముఖ్యం ? అనే దానిపై అమెరికాకు చెందిన వైద్య నిపుణుడు వివరిస్తున్నారు.

Covid Vaccine : వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలి ?..తెలుసుకోవాల్సిన విషయాలు

Corona

Updated On : August 5, 2021 / 1:34 PM IST

Vaccine Is Necessary : ప్రపంచాన్ని ఇంకా కరోనా గడగడలాడిస్తోంది. పలు దేశాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి అని నిపుణులు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్నా..వైరస్ సోకుతుందని..తదితర వాటికి భయపడి..కొంతమంది వ్యాక్సిన్ వేసుకోవడానికి ఇష్టపడడం లేదు. దీంతో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినా…తీవ్రత అంత ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో..అసలు టీకాలు ఎందుకు తీసుకోవాలి ? ఎంత ముఖ్యం ? అనే దానిపై అమెరికాకు చెందిన వైద్య నిపుణుడు వివరిస్తున్నారు.

టీకా తీసుకున్న..తీసుకోని వారికి పరీక్షలు :-
టీకా తీసుకున్న..తీసుకోని కరోనా పాజిటివ్ పరీక్షించిన..ఇద్దరు వేర్వేరు వ్యక్తులకు చెందిన ఎక్స్ రేలను పోల్చి చూపించారు. వేగంగా కోలుకోవడంతో పాటు…కొవిడ్ అనంతరం సమస్యలు సైతం తక్కువగా ఉంటాయని SMS హెల్త్, సెయింట్ లూయిస్ యూనివర్సిటీ హాస్పిటల్ డైరెక్టర్ ఘసన్ కమెల్ తెలిపారు. గత సంవత్సరం మార్చి నుంచి వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్నారు. వైరస్ సోకితే ఊపిరితిత్తులు నీటితో నిండిపోయి..వాపు వస్తుందన్నారు.

ఎక్స్ రేలో ఏముంది ?  :-

ఇక ఎక్స్ రే విషయానికి వస్తే…టీకా తీసుకోని వ్యక్తుల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని నిర్ధారించారు. ఊపిరితిత్తులు నీటితో నిండిపోయినట్లు గుర్తించారు. దీని ద్వారా..శ్వాస తీసుకొనే సమయంలో ఆక్సిజన్ వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడం కలుగుతుందని తెలిపారు. వ్యాక్సిన్ వేసుకుని కొవిడ్ పాజిటివ్ గా పరీక్షించిన వ్యక్తుల్లో వైరస్ లోడ్ తక్కువగా ఉంది.

అపోహలు వద్దు : –
ఊపిరితిత్తుల్లో చిన్న రంధ్రాలు ఉంటాయని, నీరు చేరిన కారణంగా ఈ రంధ్రాలకు ఆక్సిజన్ సరిగ్గా చేరదనే తెలిపారు. దీని కారణంగా…దగ్గు, శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయన్నారు. టీకాలు తీసుకున్న వారికి వెంటిలెటర్ అవసరం తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దంటున్నారు.