Mexico : మెక్సికోలో అకాపుల్కో హరికేన్ విధ్వంసం…39 మంది మృతి

అకాపుల్కో హరికేన్ విధ్వంసం వల్ల మెక్సికో దేశంలో 39 మంది మరణించారు. ఈ తుపాన్ విపత్తు వల్ల మరో 10 మంది గల్లంతయ్యారు. ఈ తుపాన్ వల్ల విద్యుత్, నీరు, టెలిఫోన్ సౌకర్యాలు దెబ్బతిన్నాయి....

Mexico : మెక్సికోలో అకాపుల్కో హరికేన్ విధ్వంసం…39 మంది మృతి

Acapulco Hurricane

Mexico : అకాపుల్కో హరికేన్ విధ్వంసం వల్ల మెక్సికో దేశంలో 39 మంది మరణించారు. ఈ తుపాన్ విపత్తు వల్ల మరో 10 మంది గల్లంతయ్యారు. ఈ తుపాన్ వల్ల విద్యుత్, నీరు, టెలిఫోన్ సౌకర్యాలు దెబ్బతిన్నాయి. ఓటిస్ హరికేన్ వల్ల 27 మంది మరణించారు. ప్రస్థుత అకాపుల్కో తుపాన్ వల్ల 10 మంది మహిళలు, 29 మంది పురుషులు మరణించారని భద్రతా కార్యదర్శి రోసా ఐసెలా రోడ్రిగ్జ్ చెప్పారు.

Also Read : Mike Pence :అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ సంచలన నిర్ణయం

మృతులను ఇంకా గుర్తించలేదు. తుపాన్ అనంతరం సూపర్ మార్కెట్లలో దోపిడీలు సాగుతుండటంతో 10వేలమంది భద్రతా బలగాలను మోహరించారు. మెక్సికన్ సైనికులు, నావికాదళం ఉద్యోగులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. రిసార్ట్ నగరంలో ప్రజలకు మంచినీరు, ఆహార సామాగ్రిని పంపిణీ చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.

Also Read :  Fire Accident : బొగ్గు గనిలో ఘోర అగ్నిప్రమాదం.. 32 మంది దుర్మరణం

వాతావరణశాఖ హెచ్చరికల కంటే తుపాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఇది అత్యంత భారీ తుపానుగా మెక్సికో దేశ చరిత్రలో నిలిచిపోయింది. రిసార్టు నగరంలో చిక్కుకున్న పర్యాటకులను కాపాడేందుకు సైనికబలగాలు యత్నిస్తున్నాయి.