రెక్కలు తెగిన రామచిలుకకు ట్రాన్స్‌ప్లాంట్ చేసి ఎగరడం నేర్పిన డాక్టర్

రెక్కలు తెగి ఎగరలేని పరిస్థితిలో ఉన్న ఓ రామచిలుకకు ఓ మహిళా డాక్టర్ వైద్యం చేసిన తిరిగి ఎగరటం నేర్పింది. రామచిలుక యజమాని చేసిన అఘాయిత్యానికి డాక్టర్ క్యాథరీన్ అపులీ తిరిగి మరోజన్మనిచ్చారు. ఎగరటం నేర్పించారు. దీంతో ఈ చిట్టి చిలకమ్మ చక్కగా ఎగరగలుగుతోంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్‌లో జరిగింది.
మూగ జీవాలంటే 31 ఏళ్ల వెటర్నరీ డాక్టర్ క్యాథరీన్ అపులీకి ప్రాణం.తన వృత్తి కేవలం డ్యూటీలా కాక అంకిత భావంతో చేస్తారు.ఏ జంతువుకు ఆపద వచ్చినా దానికి వైద్యం చేసి తిరిగి వాటికి చక్కటి జీవితాన్ని అందించటం ఆమెకు చాలా ఇష్టం. తన వృత్తికి నూటి నూరుశాతం అంకితభావంతో పనిచేస్తున్న డాక్టర్ క్యాథరీన్ రెక్కలు తెగి ఎగరలేనటువంటి చిలుకకు తిరిగి రెక్కలనిచ్చారు. రెక్కలను ట్రాన్స్‌ప్లాంట్ చేసి ఆ చిలుకకు ఎగరటం నేర్పించారు.
12 వారాల వయస్సు కలిగిన ముద్దులొలికే ఆ ఆకుపచ్చని ఆ రామచిలుకను ఎగురనివ్వకుండా యజమాని దాని రెక్కలను కట్ చేసేశాడు. కానీ తన సహజమైన ధోరణితో చిట్టి చిలుక ఎగరటానికి ఎంతగానో ప్రయత్నించేది. ఈ ప్రయత్నంతో అది తరచూ కిందపడి పడిపోయి గాయాలపాలయ్యింది.
ఆసుపత్రిలో ఆ రామచిలుకను పరీక్షించిన డాక్టర్ క్యాథరీన్ అపులీ దానికి చికిత్సనందించడంతో పాటు దానికి ‘వెయీ-వెయీ‘ అనే పేరు పెట్టారు. దానికి రెక్కలను ట్రాన్స్‌ప్లాంట్ చేయించేందుకు కొన్ని గంటల సమయం పట్టింది. ఇందుకోసం కొన్ని పక్షి రెక్కలు సేకరించారు క్యాథరీన్, తరువాత గ్లూ, టూత్‌పిక్స్, కాటన్ వంటివాటిని ఉపయోగించి..దానికి ఇలా రెక్కలు అమర్చిన కొద్దిగంటల్లోనే ఆ చిట్టి రామచిలుక కాస్త శక్తి పుంజుకున్నాక క్యాథరీన్ దానికి నెమ్మది నెమ్మదిగా ఎగరటం నేర్పించారు. అసలే ఎగరాలను తపన ఉన్న ఆ రామచిలుకకు మరింత ప్రోత్సాహం లభించటంతో అతి తక్కువ సమయంలోనే ఎగరగలిగింది. ఆకాశంలోకి ఎగిరి, సురక్షితంగా నేల మీదకు దిగింది.
Read Here>>కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వ్యాపిస్తే.. 1 ట్రిలియన్ డాలర్లు నష్టం తప్పదు!
అది చూసిన క్యాథరీన్ చాలా చాలా ఆనందం పడ్డారు. కాగా క్యాథరీన్ రెక్కలను ట్రాన్స్‌ప్లాంట్ చేయటం మొదటిసారి కాదు. గతంలో కూడా ఎగరలేనటువంటి పక్షులకు కొత్త రెక్కలను అమర్చి ఎగరేలా చేశారు. అంతేకాదు..చిన్న చిన్న జీవాలకు కూడా కొత్త జీవితాన్ని ఇచ్చారు. రెక్కలు తెగి పడి ఉన్న సీతాకోక చిలుకకు కూడా క్యాథరీన్ రెక్కలు అమర్చారు. కెటీ వన్బెలికమ్ అనే మహిళ ఒక సీతాకోక చిలుకకు రెక్కలను ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. దీంతో అది ఎగురగలిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.