Viral Video : విమానాన్ని ఆపేసిన దోమలు.. ఎక్కడంటే?

ఓ విమానాన్ని దోమల గుంపు ఆపేసింది. మీరు విన్నది నిజమే. ఎక్కడ? అంటే చదవండి.

Viral Video : విమానాన్ని ఆపేసిన దోమలు.. ఎక్కడంటే?

Viral Video

Updated On : October 14, 2023 / 5:22 PM IST

Viral Video : దోమలు విమానం ఆపేయడం ఏంటి? అని ఆశ్చర్యపుతున్నారా? మీరు విన్నది నిజమే. దోమలు ఫ్లైట్‌లో దాడి చేయడంతో ఓ విమానం బయలుతేరాల్సిన టైమ్‌కి టేక్ ఆఫ్ అవ్వలేకపోయింది. ఈ వింత సంఘటన గురించి చదవండి.

Kerala : పిల్లాడు కాదు పిడుగు.. 4 ఏళ్లకే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ నడుపుతున్న బాలుడి వీడియో వైరల్

మెక్సికోలో ఓ వింత సంఘటన జరిగింది. పాసింజర్ ఫ్లైట్ అయిన వోలారిస్ విమానం గువాడలహార నుంచి మెక్సికో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అంతే ఎటువైపు నుంచి వచ్చిందో ఓ దోమల దండు విమానంలోకి చొరబడింది. దాంతో ప్రయాణికులంతా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఇక విమాన సిబ్బంది దోమల్ని తోలే పనిలో పడ్డారు.

విమాన సిబ్బంది దోమలపై స్ప్రే చల్లుతూ వాటితో యుద్ధం చేయడం మొదలుపెట్టారు. స్ప్రే కారణంగా విమానం అంతా పొగ కమ్మేసింది. ఈ తతంగాన్ని కొందరు ప్రయాణికులు వీడియో తీయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. అంత కష్టపడి దోమల్ని తరిమిన సిబ్బందిని ప్రయాణికులు అభినందించారు కూడానండోయ్.

MLC Kavitha Bathukamma Song: ఎమ్మెల్సీ కవిత పాడిన బతుకమ్మ పాట విన్నారా? వీడియో వైరల్

మెక్సికన్ విమానంలో దోమల గుంపులు దాడి చేయడం ఇదేం మొదటిసారి కాదట. 2019 లో కూడా ఇలాంటి సంఘటన జరిగిందట. ఎయిర్ పోర్టుకి దగ్గరలో తరచుగా వరదలు సంభవిస్తుండటంతో పాటు భారీ వృక్షాల కారణంగా దోమల బెడద ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.