MLC Kavitha Bathukamma Song: ఎమ్మెల్సీ కవిత పాడిన బతుకమ్మ పాట విన్నారా? వీడియో వైరల్

ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో ఘనంగా జురుపుకునే పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

MLC Kavitha Bathukamma Song: ఎమ్మెల్సీ కవిత పాడిన బతుకమ్మ పాట విన్నారా? వీడియో వైరల్

MLC Kavitha Bathukamma Song

Updated On : October 14, 2023 / 11:06 AM IST

MLC Kavitha : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ప్రతీయేటా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ సంబురాలను రాష్ట్ర వ్యాప్తంగా వేడుకగా నిర్వహిస్తోంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగకు రోజుకో పేరుతో నిర్వహిస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ఈ సంబురాలు ప్రారంభమవుతాయి. మరోవైపు బంతుకమ్మ పండుగ అనగానే పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా పాటలతో మారుమోగుతాయి. తాజాగా ఎమ్మెల్సీ కవిత తాను పాడిన పాటను ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also : Bathukamma 2023 : బతుకమ్మ పండుగ వెనుక ఆసక్తికర కథలు..

ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో ఘనంగా జురుపుకునే పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మన ఆడబిడ్డల ఆత్మీయ సంగమం, మన తెలంగాణ ఆత్మగౌరవ సంబరం బతుకమ్మ అన్నారు. ఈ సందర్భంగా జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాటల ఆల్బమ్ ను కవిత తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఇందులో ఓ పాటకు కవిత కోరస్ ఇచ్చారు. ప్రస్తుతం కవిత ట్వీట్ వైరల్ గా మారింది.