Viral Video : హైటెక్ బిచ్చగాడు.. విమానంలో భిక్షాటన చేసిన వ్యక్తి వీడియో వైరల్

విమానం ఎక్కి భిక్షాటన చేశాడో వ్యక్తి. విమానం ఎక్కగలిగే స్థోమత ఉండి భిక్షాటన ఏంటి? అని డౌట్ వస్తుంది. హైటెక్ బిచ్చగాడేమో.. ఎవరో తెలుసుకోవాలని ఉందా? చూడండి.

Viral Video : హైటెక్ బిచ్చగాడు.. విమానంలో భిక్షాటన చేసిన వ్యక్తి వీడియో వైరల్

Hitech Beggar

Updated On : July 15, 2023 / 11:06 AM IST

Hitech Beggar : రైల్వే స్టేషన్లలో, బస్ స్టాప్‌లలో భిక్షాటన చేసేవాళ్లని చూసాం. విమానంలో భిక్షాటన చేశాడో వ్యక్తి.  బాగా హైటెక్ బిచ్చగాడు అని ఆశ్చర్యపోతున్నారా? .. ఓ పాకిస్తానీ వ్యక్తి  ఫ్లైట్‌లో భిక్షాటన చేయడం వైరల్‌గా మారింది.

Abrar Hasan : పాకిస్తాన్ వ్లాగర్ అబ్రార్ హసన్ భారత్‌లో బైక్ టూర్ .. ఫిదా అయిన ఇండియన్స్

@MeghUpdates అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో చూసి జనం షాకయ్యారు. ఫ్లైట్‌లో ఓ పాకిస్తానీ వ్యక్తి ప్రయాణికులను డబ్బు అడగడం వైరల్ అయ్యింది. అయితే తాను అడుక్కోవడం లేదని, లాహోర్‌లో మదర్సా నిర్మించేందుకు నిధులు సేకరిస్తున్నానని ఆ వ్యక్తి స్పష్టం చేశాడు. వీడియోలో నీలం రంగు జాకెట్, తెల్లటి కుర్తా పైజామా వేసుకున్న వ్యక్తి స్పీచ్ ఇస్తూ విమానంలో నిలబడి ఉన్నాడు. మేము మదర్సా నిర్మించడానికి నిధులు సేకరిస్తున్నాము.. అని అతను తన తోటి ప్రయాణికులకు తెలిపాడు. ‘మీరు విరాళం ఇవ్వాలనుకుంటే, లేచి నా దగ్గరకు రాకండి. నేను మీ సీటు దగ్గరకు వస్తాను’ అని చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Suleman Dawood : పాకిస్తాన్ బిలియనీర్ కొడుకు సులేమాన్ దావూద్‌కి టైటానిక్ యాత్రకు వెళ్లడం అస్సలు ఇష్టం లేదట.. తండ్రి కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు

పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో పోరాడుతున్న సమయంలో ఈ వీడియో వచ్చిందని కొందరు.. డబ్బు అడిగాడని మరి కొందరు విమర్శించారు. కొంతమంది ఆ వ్యక్తిని అక్తర్ లావా అనే వ్యక్తిగా చెబుతున్నారు. అతను పాకిస్తాన్‌లో పేరున్న బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్ అని అంటున్నారు.  కావాలనే ఇలాంటి వీడియోలు చేసి వైరల్ అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.