రిక్షా లాగుతున్న రోబో

  • Published By: venkaiahnaidu ,Published On : October 20, 2020 / 04:04 PM IST
రిక్షా లాగుతున్న రోబో

Updated On : October 20, 2020 / 4:51 PM IST

Robot Pulling A Rickshaw ఓ రోబో.. ప్యాసింజర్ రిక్షాను లాగుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో..అమెరికన్ స్పెషల్ ఎఫెక్ట్స్ డిజైనర్ ఆడమ్ సవేజ్..రోబో డాగ్ మూడు చక్రాల ప్యాసింజర్ రిక్షాను లాగడాన్ని టెస్ట్ చేశారు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ… సుప్రియా సాహు అనే ఐఏఎస్ ఆఫీసర్ సోమవారం ఈ క్లిప్ ను షేర్ చేయడంతో ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.



భవిష్యత్ రిక్షాలు అంటూ సుప్రియా సాహు చేసిన వీడియోకి పెద్ద ఎత్తున నెటిజన్ల నుంచి స్పందన లభించింది. ఇంతకుమెందెప్పుడూ ఇలాంటి రిక్షా చూడలేదు నిజంగానే అద్భుతం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా…నా తరపున ఆఫీస్ కి వెళ్లి పనిచేసే రోబోని తయారుచేసేవాళ్ల కోసం ఎదురుచూస్తున్నా అంటూ మరో నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశారు.



https://10tv.in/a-womans-narrow-escape-from-a-house-collapse-in-moghalpura/
ఈ రోబోని అమెరికన్ ఇంజినీరింగ్ అండ్ డిజైన్ కంపెనీ బోస్టన్ డైనమిక్స్ అభివృద్ధి చేసింది. అసాధారణమైన శక్తితో భాభాగాన్ని నేవిగేట్ చేయగల శక్తి ఈ రోబోకి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ వీడియో క్లిప్ మొదటిసారి సోషల్ మీడియాలోకి వచ్చింది.