Guinness World Records : తలపై 319 గాజు గ్లాసులు మోసి వరల్డ్ రికార్డ్.. చివరికి వాటిని ఏం చేశాడంటే?

వింత గొలిపే ప్రపంచ రికార్డులు చూస్తూ ఉంటాం. తాజాగా అలాంటిదే మరొకటి. ఓ వ్యక్తి తలపై ఏకంగా 318 గాజు గ్లాసులు మోశాడు. రికార్డ్ సాధించాడా? చివరికి ఏం జరిగింది?

Guinness World Records : తలపై 319 గాజు గ్లాసులు మోసి వరల్డ్ రికార్డ్.. చివరికి వాటిని ఏం చేశాడంటే?

Guinness World Records

Updated On : October 21, 2023 / 4:00 PM IST

Guinness World Records : సైప్రస్‌లోని పాఫోస్‌కు చెందిన అరిస్టోటెలిస్ వాలారిటిస్ అనే వ్యక్తి తలపై 319 గ్లాసులను బ్యాలెన్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ జాబితాలో చేరాడు. తలపై ఉన్న గ్లాసుల్ని చివరలో ఏం చేశాడనేది ఇక్కడ ఇంట్రస్టింగ్ కలిగించే అంశం.

Pepper X : ప్రపంచంలో అత్యంత కారం కలిగిన మిర్చికి గిన్నిస్ రికార్డ్

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ యాజమాన్యం అరిస్టోటెలిస్ వాలారిటిస్ అనే వ్యక్తి తలపై  గాజు గ్లాసుల్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకున్న వీడియోను ఇంటర్నెట్‌లో షేర్ చేసింది. అతను తలపై అక్షరాల 319 గాజు గ్లాసుల్ని మోస్తూ డ్యాన్స్ చేస్తున్నట్లు వీడియోలో మనకి కనిపిస్తుంది. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన అరిస్టోటెలిస్ వాలారిటిస్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది.

Guinness Record : పేక ముక్కలతో ప్యాలెస్ కట్టేసి గిన్నిస్ రికార్డు .. 15 ఏళ్ల కోల్‌కతా కుర్రాడి ఘనత
తలపై గ్లాసులను మోస్తూ వాలారిటిస్ కనిపించడంతో వీడియో మొదలవుతుంది. అతని తలపై గ్లాసుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. వాటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తాడు. మొత్తం పూర్తయ్యాక తన కదలికలతోనే వాటిని కింద పడేసాడు. అతను ఇలా వీటిని బ్యాలెన్స్ చేయడం మొదటిసారి కాదు. 49 గ్లాసులు బ్యాలెన్స్ చేసి డ్యాన్స్ చేసిన రికార్డ్ కూడా అతని పేరున ఉంది. మే 26, 2023 న 319 వైన్ గ్లాసులను బ్యాలెన్స్ చేసి కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసాడు అరిస్టోటెలిస్ వాలారిటిస్. అతని రికార్డు చూసి కొందరు ఆశ్చర్యపోగా.. కొందరు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Guinness World Records (@guinnessworldrecords)