Gold House : కేజీఎఫ్ బంగారమంతా ఇక్కడే ఉందా ఏంటీ..?! ఈ వ్యాపారవేత్త ఇల్లంతా బంగారమే..గ్యాస్ స్టౌవ్‍తో సహా !!

కేజీఎఫ్ బంగారంతా ఇక్కడే ఉందా ఏంటీ..అనిపించేలా ఉందో ఓ వ్యాపారవేత్త గోల్డ్ ప్యాలెస్‍. గ్యాస్ స్టవ్‌తో సహా అంతా బంగారమే పోత పోసి ఉంది.!!

Gold House : కేజీఎఫ్ బంగారమంతా ఇక్కడే ఉందా ఏంటీ..?! ఈ వ్యాపారవేత్త ఇల్లంతా బంగారమే..గ్యాస్ స్టౌవ్‍తో సహా !!

vietnam man gold house

Updated On : December 19, 2022 / 4:09 PM IST

vietnam man gold house : రూపాయి రూపాయి పొదుపుచేసి..బంగారం కొనుక్కొంటుంటారు. పెట్టుబడులు, ఆభరణాల రూపంలో బంగారం ఉంటే భద్రత ఉందనుకుంటారు. ఇది మనలాంటి సాధారణ ప్రజల పరిస్థితి. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా బంగారంతో ఇల్లే కట్టేశాడు. ఇల్లే కాదు ఇల్లంతా బంగారం మయమే.ఆఖరిని వంట చేసుకునే గ్యాస్ స్టౌవ్ కూడా బంగారమే. పక్కనే ఉన్న పాత్రల గురించి చెప్పనే అక్కరలేదు.అన్ని బంగారమే. ఎక్కడ చూసిని జిగేల్ జిగేల్ మనే బంగారమే ఆ ఇల్లంతా. వియత్నాంలోని ఓ ఇల్లును చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!!

vietnam man gold house

ఈ ఇల్లును చూస్తే ఏదో పురావస్తు ప్రదర్శనశాలో అనుకుంటాం. లేదా ఏదో బంగారంతో కట్టిన దేవాలయం అనుకుంటాం. కానీ ఓ వ్యక్తి తన ఇంటిని బంగారంతో కట్టేసుకున్నాడు.అది అలాంటి ఇలాంటి ఇల్లు కాదు. ఏకంగా బంగారు గనుల్ని తవ్వుకొచ్చి ఈ ఇల్లు కట్టేశారా? అనిపిస్తుంది. పక్కగా కేజీఎఫ్ ను తలపిస్తుంది.కేజీఎఫ్ సినిమాలో కూడా ఇటువంటి ఇల్లు లేదు.

బంగారంతో కట్టిన ఇల్లు ఫోటోలు చూస్తేనే కనురెప్ప వేయటం మర్చిపోతాం. శిలాప్రతిమలాగా కళ్లప్పగించి చూడాల్సిందే. రియల్‌ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన పట్టిందల్లా బంగారమే అయింది. దీంతో ఆయన తన ఇల్లంతా బంగారంతో నింపేసుకున్నారు. ఎంగ్యూయెన్ వాన్ ట్రూంగ్ అనే వ్యాపారి. కాన్‌థో నగరంలో ఈ బంగారు భవనాన్ని నిర్మించుకున్నారు వాన్‌ ట్రూంగ్.


వాన్‌ ట్రూంగ్ ఇంట్లో ప్రతీది బంగారమే. వస్తువులన్నీ పసిడితో తయారుచేయించుకున్న వాన్ ట్రూంగ్ గోడలు, పైకప్పును బంగారంతో తాపడం చేయించాడు. ఒక్కసారి ఇంట్లోకి అడుగుపెడితే ఎటుచూసినా బంగారమే కనిపిస్తుంది. గ్యాస్ స్టవ్‌తో సహా కిచెన్, హాల్, మెట్లు అన్నీ పసిడి వర్ణంలో మెరిసిపోతున్నాయి. వియత్నాం వచ్చే విదేశీ పర్యాటకులకు ఇప్పుడీ ఇల్లు కూడా ఓ టూరింగ్ స్పాట్‌లా మారింది. బంగారపు ఇల్లు, అందులోని భారీ విగ్రహాలు చూసి దేశ,విదేశ పర్యాటకులు అచ్చెరువొందుతున్నారు. వియత్నాం దేశానికే ప్రత్యేక ఆకర్షణగా మారిన ఈ స్వర్ణ భవంతిని నిర్మించడానికి వాన్‌ ట్రూంగ్ మూడేళ్లు కష్టపడ్డారు.

gold man gold house

ఇల్లు ఎలా నిర్మించాలి…అలంకరణకు ఏ వస్తువులు ఉపయోగించాలి…వంటివాటన్నింటినీ పరిశీలించేందుకు అనేక దేశాలు తిరిగారు వాన్ ట్రూంగ్. ప్రపంచంలో మరెక్కడా బంగారపు ఇల్లు లేదని తెలుసుకున్న వాన్ ట్రూంగ్…తన సంపదకు చిహ్నంగా…స్వర్ణపు కాంతులీనే నివాసాన్ని నిర్మించుకున్నారు. ఆరేళ్ల క్రితం వచ్చిన ఆయన ఆలోచనకు నిలువెత్తు బంగారం రూపం ఈ బంగ్లా..ఈ బంగారు ఇంటి గురించి ఎంత చెప్పినా తక్కువే.

రాజా కుబేరుడా..గోల్డెన్ ప్యాలెస్, 7వేల లగ్జరీ కార్లు, గోల్డ్ కోటింగ్ విమానం..ప్రతీ అంగుళం బంగారమే..