విక్రమ్ ల్యాండర్ ను కనుగొన్న చెన్నై చిన్నోడు
చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్ సెప్టెంబరు 7న దక్షిణ ధ్రువంలో పడిందని మాత్రమే తెలిసిన మనకు తాజాగా అదెక్కడ పడిందో గుర్తించినట్లు తెలిపింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా. కాగా .... విక్రమ్ ల్యాండర్ ఎక్కడ పడిపోయిందో కనుక్కున్నవ్యక్తి మన చెన్నె చిన్నోడే అని తెలిస్తే చాలా గర్వంగా ఉంటుంది. విక్రమ్ జాడను తొలిసారి గుర్తించినట్లు నాసా కూడా అతనికి క్రెడిట్ ఇచ్చింది.

చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్ సెప్టెంబరు 7న దక్షిణ ధ్రువంలో పడిందని మాత్రమే తెలిసిన మనకు తాజాగా అదెక్కడ పడిందో గుర్తించినట్లు తెలిపింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా. కాగా …. విక్రమ్ ల్యాండర్ ఎక్కడ పడిపోయిందో కనుక్కున్నవ్యక్తి మన చెన్నె చిన్నోడే అని తెలిస్తే చాలా గర్వంగా ఉంటుంది. విక్రమ్ జాడను తొలిసారి గుర్తించినట్లు నాసా కూడా అతనికి క్రెడిట్ ఇచ్చింది.
చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్ చందమామపై హర్డ్ ల్యాండింగ్ అయి ఆచూకీ లేకుండా పోయింది. ఇది మన శాస్త్రవేత్తల ముందు ఎన్నో సవాళ్ళను, అనుభవాలను మిగిల్చింది. అప్పటి నుంచి చంద్రయాన్ వెతుకులాటలో నాసా, ఇస్రో మునిగిపోయాయి. అక్కడ ఉన్న చీకటి వల్ల అది పడిన ఆనవాళ్లు కూడా గుర్తించలేకపోయాయి. సెప్టెంబరు 7న దక్షిణ ధ్రువంలో పడిందని మాత్రమే తెలిసిన మనకు తాజాగా అదెక్కడ పడిందో గుర్తించినట్లు తెలిపింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా. కాగా …. విక్రమ్ ల్యాండర్ ఎక్కడ పడిపోయిందో కనుక్కున్నవ్యక్తి మన చెన్నె చిన్నోడే అని తెలిస్తే చాలా గర్వంగా ఉంటుంది. విక్రమ్ జాడను తొలిసారి గుర్తించినట్లు నాసా కూడా అతనికి క్రెడిట్ ఇచ్చింది. షణ్ముగ వృత్తి రీత్యా మెకానికల్ ఇంజినీర్. బ్లాగర్. యాప్ డెవలపర్. క్యూఏ ఇంజినీర్.
Is this Vikram lander? (1 km from the landing spot) Lander might have been buried in Lunar sand? @LRO_NASA @NASA @isro #Chandrayaan2 #vikramlanderfound #VikramLander pic.twitter.com/FTj9G6au9x
— Shan (@Ramanean) October 3, 2019
లూనార్ ఆర్బిటార్ తొలిసారి తీసిన ఫోటోలను డౌన్‌లోడ్ చేసుకుని.. వాటిని పరిశీలిస్తున్న సమయంలో ఇంజినీర్ షణ్ముగకు కొన్ని డౌట్స్ వచ్చాయి. ఫోటోల్లో ఉన్న కొన్ని ప్రాంతాలను గుర్తించి.. బహుశా ఆవే విక్రమ్ కూలిన ప్రాంతాలేమో అని నాసాకు ట్వీట్ చేశారు. నిజానికి చంద్రుడి గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహాంతో షణ్ముగ పదేపదే ఎల్ఆర్వో రిలీజ్ చేసిన ఫోటోలను పరిశీలించాడు. ఒకవేళ విక్రమ్ సక్రమంగా ల్యాండ్ అయి.. అది ఫోటోలను పంపినా, చంద్రుడిపై ప్రతి ఒక్కరికీ ఇంత ఇంట్రెస్ట్ ఉండేది కాదేమో అని షణ్మగ తన మెయిల్ ద్వారా నాసాకు తన అభిప్రాయాన్ని వినిపించాడు. తొలుత ఎల్ఆర్వీ ఇమేజ్‌లను అప్పుడప్పుడు స్కాన్ చేస్తూ ఉన్న షణ్ముగకు కొన్ని తేడాలు కనిపించాయి.
@NASA has credited me for finding Vikram Lander on Moon’s surface#VikramLander #Chandrayaan2@timesofindia @TimesNow @NDTV pic.twitter.com/2LLWq5UFq9
— Shan (@Ramanean) December 2, 2019
విక్రమ్ ఏ దిక్కున కూలింది, అది కూలే సమయంలో ఉన్న దాని వేగం, ఆ అంశాలను పరిగణలోకి తీసుకుని షణ్ముగ విక్రమ్ ఆచూకీ కోసం ప్రయత్నించాడు. దాంతోనే విక్రమ్ కూలిన కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించగలిగాడు. వాస్తవానికి విక్రమ్ దిగాల్సిన ప్రాంతానికి సుమారు మూడోవంతు మైలు దూరంలో ఓ చిన్నపాటి వైట్ స్పార్క్‌ను గుర్తించాడు. అంతకముందు పరిశీలించిన ఇమేజ్‌లో ఆ స్పాట్ లేనట్లు షణ్ముగ పసికట్టాడు. ఆ తేడాతో యువ ఇంజినీర్ ఓ ఐడియాకు వచ్చేశాడు. బహుశా విక్రమ్ కూలడం వల్ల ఆ ప్రాంతంలోనే ల్యాండర్ కనుమరుగై ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు.
రెండు దృశ్యాల్లో ఉన్న తేడాలను గుర్తించిన షణ్ముగ వాటిని నాసాకు పంపించాడు. తన ట్విట్టర్ అకౌంట్‌లోనూ నాసా ఫోటోలను పోస్టు చేశాడు. లూనార్ ఆర్బిటార్ వాటిని స్టడీ చేసింది. చంద్రుడిపై విక్రమ్ కూలకముందు, కూలిన తర్వాత నవంబర్ 11వ తేదీన తీసిన ఫోటోలను నాసా అధ్యయనం చేసింది. అయితే ఎక్కడైతే విక్రమ్ దిగాలో.. దానికి ఆగ్నేయ దిశలో సుమారు 2500 అడుగుల దూరంలో విక్రమ్ ఉన్నట్లు నాసా ద్రువీకరించింది. కొన్ని గంటల క్రితమే నాసా శాస్త్రవేత్తలు షణ్ముగకు మెయిల్ చేశారు. ఆ లేఖలో విక్రమ్‌ను గుర్తించిన షణ్ముగకు కంగ్రాట్స్ చెప్పారు. సుబ్రమణ్యస్వామి జన్మతిథి షష్ఠి. షణ్ముగ షష్ఠి రోజునే నాసా ఈ శుభ సందేశం వినిపించడం సంతోషకరమే. నాసా తనకు క్రెడిట్ ఇచ్చిన విషయాన్ని షణ్ముగ తన ట్వీట్‌లో తెలిపాడు.